Skip to main content

Posts

సత్యవతి కాంతం

ఒక వూళ్ళో సత్యవతి కాంతం అని ఇద్దరు ఆడవాళ్ళుండేవారు. సత్యవతి పూలు అమ్ముకునేది. కాంతం చేపలు అమ్ముకునేది. వీళ్ళను చూసే వారెవరూ లేకపోవడంతో కష్ట పడాల్సి వచ్చేది. ఒక రోజు వాన పడడంతో ఆలస్యం అయిపోయింది. పూట కూళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని, పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు. తినడానికి పెట్టి, నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ. కాంతం పూల వాసన భరించలేక పోయింది. ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థ పడింది. వెళ్ళి తన చేపల బుట్ట తెచ్చుకుని, తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. తెల్లవారి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. పెద్దమ్మ ఆశ్చర్యపోయింది. సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు? అవి కాంతం కి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలా సేపు ఆలోచించింది. మీకేమైన తెలిసిందా? కాంతం పొద్దస్తమానూ చేపలతోనే గడుపుతుంది కదా! అందుకే ఆ వాసనే అలవాటు అయిపోయింది. పూల సువాసనని ఆస్వాదించలేదు.

పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక

ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దెగ్గిర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద చేసింది.పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, “ఇదేంటి? నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంత కాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు?” అని అడిగింది. ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయ్యారు అయ్యింది. రెండు ఎలుకలూ రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంట గదికి తీసుకువెళ్ళింది. ఆకడ ఇంట్లోవాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది. పల్లెటూరి ఎలుక, “నువ్వు నిజమే చెప్పావు! మా వూరిలో ఎప్పుడొ పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది” అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది.

తిక్కరాజు-వెర్రిమంత్రి

అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం, మంచివాళ్ళే- కానీ రాజుకీ, మంత్రికీ మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరు రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించటం అంటే అస్సలు ఇష్టంలేదు. అందుకని, ఏదైనా ప్రత్యేకత ఉండాలని, వాళ్ళొక శాసనం చేసారు- పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు: "రాజ్యంలో ప్రతివాళ్ళూ చీకట్లో పని చెయ్యాలి; తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో, వాళ్లకు మరణ దండన!" ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలౌతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు. ఒకరోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు, మహిమాన్వితుడైన ఒక గురువు. మధ్యాహ్నం అవుతున్నది; నగరం చాలా అందంగా ఉన్నది. కానీ అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదుగదా, ఒక్క ఎలుకకూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయె! రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు! గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అయితే సాయంత్రం అయ్యేసరికి, నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్

స్నేహితుడిసలహా

రావులపాలెంలో ఉండే చంద్రయ్య చాలా వింత మనిషి . అతనికి ఐదు ఆవులు ఉండేవి. అయినా అతను మాత్రం వాటి ఆలనా పాలనా పట్టించుకునేవాడు కాడు. భర్తను ఏమీ అనలేని లక్ష్మమ్మ ఇరుగు పొరుగుల్ని ప్రాధేయపడి, వాళ్ల పొలాల నుండి రోజూ కాస్తంత గడ్డి తెచ్చి వేసి ఎలాగో ఒకలాగా ఆవుల్ని సాకేది. వాటి పాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బులతోటే కుటుంబం గడిచేది. అయినా చంద్రయ్య మాత్రం ఏ పనీ చేయకుండా "నేను అదృష్టజాతకుడిని , ఏదో ఒకనాటికి నాకు కాలం కలిసొస్తుంది. అకస్మాత్తుగా నేను ధనవంతుడినైపోతానట- చూస్తూండండి. అందుకేగద, నేను ఇలా నిశ్చింతగా ఉంటున్నది!" అని అందరితో చెప్పుకుంటూ తిరిగేవాడు. ఒకసారి చంద్రయ్యను చూసి పోయేందుకు వాళ్ళింటికి వచ్చాడు శివరాం. శివరాం చంద్రయ్యకు చిన్ననాటి మిత్రుడు. చంద్రయ్య పద్ధతిని గమనించిన శివరాం అతన్ని చాలాసేపు మెచ్చుకొని, "చూడగా నువ్వనే అదృష్టం ఏదో నీ తలుపు తట్టే రోజు దగ్గరలోనే ఉన్నట్లుంది. ఏమైందో తెలుసా? -ఈ మధ్యే ఒక యోగిని సంప్రదించాను, నీ గురించి. ఆయనకూడా అదే చెప్పాడు- కోరిన కోరికలన్నిటినీ తీర్చే కామధేనువు ఈసారి మన ఊరి ప్రక్క అడవిలోకే రానున్నదట. ఈ దసరా నుండి సంక్రాంతిలోపలే ఏదో‌ ఒక రోజున

జ్ఞానం-పాండిత్యం

అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ శాంతి సౌఖ్యాలతో, సమ భావంతో, కలిసి మెలిసి జీవించేవాళ్లు. ఆ ఊరికి ఒక సాంప్రదాయం ఉండేది: మంచి పండితుల్ని , తత్త్వవేత్తలను అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి ఆహ్వానించేవాళ్ళు; వాళ్ల చేత ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇప్పించుకునేవాళ్లు. వాటి ద్వారా ఊళ్ళోవాళ్లంతా మంచి విలువలను పెంపొందించుకొనే వాళ్ళు. దీని వెనక ఉన్నది, ఆ ఊరి పెద్ద త్యాగయ్య. ఆయన బాగా చదువుకున్నవాడు, శాంత స్వభావి, మంచి తెలివైనవాడు కూడా. ఒకసారి ఆయన మంచి పేరు గడించిన పండితులు ఇద్దరిని తమ ఊళ ్ళో ప్రసంగించేందుకుగాను ఆహ్వానించారు. ఊళ్ళోవాళ్ళు ఉపన్యాస వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆరోజు ఉదయం పండితులిద్దరూ ఊరు చేరారు. త్యాగయ్యగారి ఇంట్లోనే వారికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పండితుల రాకతో తన ఇల్లు పావనమైందని అనుకున్నారు త్యాగయ్యగారు. కొద్ది సేపు అవీ-ఇవీ మాట్లాడిన తర్వాత వాళ్ళలో మొదటి పండితుడు స్నానాల గదిలోకి వెళ్ళాడు, స్నానం చేసేందుకు. అంతలో రెండవ పండితుడు రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి త్యాగయ్యతో ఇలా అన్నాడు: "ఇప్పుడు స్నానానికి వెళ్ళాడు చూశారా, పైకి పండితుడు! కానీ నిజానికి వీడు ఒక దున్నపో

మార్గం చూపిన మొసలి

మించలవారికోట గ్రామానికి చివరలో ఒక చెరువు ఉండేది. చెరువు గట్టున గణేష్ వాళ్ళు రోజూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజున వాడు బంతినొకదాన్ని తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఆ సమయానికి మిగిలిన పిల్లలెవ్వరూ రాలేదు ఇంకా. వాడొక్కడే అలా బంతితో ఆడుతుంటే, అది కాస్తా వెళ్ళి చెరువులో ఎక్కడో పడిపోయింది. గణేశ్ కు ఈత వచ్చు కదా, అందుకని బంతిని వెతుక్కుంటూ చెరువులోకి దిగాడు. అంతలో వాడికి దగ్గర్లో ఏదో కదులుతున్న అలికిడి వినబడింది. ఏంటా అని చూస్తే అది ఒక మొసలి! వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటోంది, ఆగి ఆగి. గణేశ్‌ పారిపోదామనుకున్నాడు. కానీ 'అది వలలో‌ చిక్కుకొని ఉన్నది కదా, భయపడేదేముందిలే' అని, దానికి దగ్గరగా వెళ్ళాడు, బురదలో నడుస్తూ. గణేశ్‌ను చూడగానే మొసలి బాధతోటీ సంతోషంతోటీ కన్నీళ్ళు కార్చింది. 'కాపాడు కాపాడు' అని మొరపెట్టుకున్నది. 'నన్ను రక్షించు, ప్లీజ్' అని వేడుకున్నది. గణేశ్‌కి కొంచెం భయం వేసింది. అయినా 'అది అంతగా వేడుకుంటున్నది గదా' అని జాలికూడా వేసింది. 'నువ్వు కౄరమృగానివి కదా! నిన్ను వలలోంచి విడిపించగానే నన్ను పట్టుకొని తినేస్తావేమో?' అన్నాడు. 'అయ్యో, న

భయం

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చుట్టూ చెట్టూ, చేమా, పొలమూ పుట్రా ఉన్నాయి. ఆ పొలాల మధ్యలోంచే వూళ్ళోకి వచ్చే పోయే దారి వుంది. ఆ దారి వేరే వూళ్ళకు పోయే దారులను కలుపుతుంది. అలా కలిసే కూడల్లో మనుషులు ఒకరికొకరు ఎదురవుతారు. పలకరించుకుంటారు. ఒకరి పొడ ఒకరికి గిట్టకపోతే ముఖాలు తిప్పుకొని ఎవరిదారిన వాళ్ళు పోతూ వుంటారు. అది మనుషుల కథ. మామూలు కథ. మరి మనుషులకు వేరే జీవులు ఎదురయితే ఏమవుతుందో, ఇదే ఇంకో కథ. అవాళ- మనిషి, పాము ఒకరికొకరు ఎదురయిపోయారు. 'అమ్మో విషప్పురుగు. దాని కోరల్లో విషం..' అని భయంతో ఆగిపోయాడు మనిషి. 'అమ్మో విషప్పురుగు. మనకు కోరల్లోనే విషం. మనుషులకు నిలువెల్లా విషమే..' అని భయంతో ఆగిపోయింది పాము. ఇద్దరూ అలాగే రెండు క్షణాలసేపు ఒకరివంక ఒకరు చూస్తూ వుండిపోయారు. మనిషి వెనక్కి తగ్గుదామనుకున్నాడు. అడుగు తీసి అడుగు వెనక్కి వేద్దామనుకున్నాడు. కానీ పాము వెంట పడితే..? వెంటపడి కాటేస్తే..?' ఆలోచనలతో ఆగిపోయాడు. పాముకూడా వెనక్కి తగ్గుదామనుకుంది. జరజరా వెనక్కి వెళ్ళిపోదామనే అనుకుంది. కానీ మనిషి వెంటపడితే..? వెంటపడి కొడితే..?' ఆలోచనలతో ఆగిపోయింది. 'నన్ను కాటెయ్యద్దు