Skip to main content

Posts

Showing posts from September, 2014

దొంగ ఎవరు?

అక్బర్ బాద్ షా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పనివాడు ఒక రోజు దొంగతనం చేసి , నగలు , రొక్కం తీసుకుని పారిపోయాడు.కొన్ని రోజులు అయ్యాక , ఒక సారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూసాడు. ఆ పనివాడు కూడ ధనవంతుడిని చూసాడు. ఎక్కడా పారిపోవడానికి దారిలేదని గ్రహించి , వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు. “ దుర్మార్గుడా! దొరికావు! ఇప్పుడెలా పారిపోతావు ? దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా ? నా నగలు , రొక్కం తిరిగి ఇవ్వు! ” అని అరవడం మొదలుపెట్టాడు. ధనవంతుడు నిర్ఘాంత పోయాడు. “ నేను దొంగతనం చేయడం యేమిటి , వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజ భటులకు పట్టిస్తాను! ” అని గొడవపడ సాగాడు. బజారులోని కొందరు పెద్దమనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరకి న్యాయం కోసం తీసుకు వెళ్ళారు. బీర్బల్ యెదురుకుండా ఇద్దరు వారి వారి కథలను మళ్ళి చెప్పారు.బీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి , “ ఇద్దరిని ఒక కిటికీ దగ్గిరకి తీసుకెళ్ళి అందులోంచి తలలను బయట పెట్టమను ” అన్నాడు.ఇద్దరు కిటికి బయట తలలు పెట్టాక , బీర్బల్ , “ ఇప్పుడు పనివాడి తల నరికేయి! ” అని ఆదేశించాడు. ఈ మాట వినంగానే అసలు పనివాడు ఖంగా