Skip to main content

Posts

Showing posts from October, 2015

సత్యవతి కాంతం

ఒక వూళ్ళో సత్యవతి కాంతం అని ఇద్దరు ఆడవాళ్ళుండేవారు. సత్యవతి పూలు అమ్ముకునేది. కాంతం చేపలు అమ్ముకునేది. వీళ్ళను చూసే వారెవరూ లేకపోవడంతో కష్ట పడాల్సి వచ్చేది. ఒక రోజు వాన పడడంతో ఆలస్యం అయిపోయింది. పూట కూళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని, పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు. తినడానికి పెట్టి, నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ. కాంతం పూల వాసన భరించలేక పోయింది. ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థ పడింది. వెళ్ళి తన చేపల బుట్ట తెచ్చుకుని, తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. తెల్లవారి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. పెద్దమ్మ ఆశ్చర్యపోయింది. సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు? అవి కాంతం కి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలా సేపు ఆలోచించింది. మీకేమైన తెలిసిందా? కాంతం పొద్దస్తమానూ చేపలతోనే గడుపుతుంది కదా! అందుకే ఆ వాసనే అలవాటు అయిపోయింది. పూల సువాసనని ఆస్వాదించలేదు.

పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక

ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు. పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దెగ్గిర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద చేసింది.పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, “ఇదేంటి? నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంత కాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు?” అని అడిగింది. ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయ్యారు అయ్యింది. రెండు ఎలుకలూ రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంట గదికి తీసుకువెళ్ళింది. ఆకడ ఇంట్లోవాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది. పల్లెటూరి ఎలుక, “నువ్వు నిజమే చెప్పావు! మా వూరిలో ఎప్పుడొ పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది” అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది.

తిక్కరాజు-వెర్రిమంత్రి

అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం, మంచివాళ్ళే- కానీ రాజుకీ, మంత్రికీ మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరు రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించటం అంటే అస్సలు ఇష్టంలేదు. అందుకని, ఏదైనా ప్రత్యేకత ఉండాలని, వాళ్ళొక శాసనం చేసారు- పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు: "రాజ్యంలో ప్రతివాళ్ళూ చీకట్లో పని చెయ్యాలి; తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో, వాళ్లకు మరణ దండన!" ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలౌతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు. ఒకరోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు, మహిమాన్వితుడైన ఒక గురువు. మధ్యాహ్నం అవుతున్నది; నగరం చాలా అందంగా ఉన్నది. కానీ అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదుగదా, ఒక్క ఎలుకకూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయె! రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు! గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అయితే సాయంత్రం అయ్యేసరికి, నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్

స్నేహితుడిసలహా

రావులపాలెంలో ఉండే చంద్రయ్య చాలా వింత మనిషి . అతనికి ఐదు ఆవులు ఉండేవి. అయినా అతను మాత్రం వాటి ఆలనా పాలనా పట్టించుకునేవాడు కాడు. భర్తను ఏమీ అనలేని లక్ష్మమ్మ ఇరుగు పొరుగుల్ని ప్రాధేయపడి, వాళ్ల పొలాల నుండి రోజూ కాస్తంత గడ్డి తెచ్చి వేసి ఎలాగో ఒకలాగా ఆవుల్ని సాకేది. వాటి పాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బులతోటే కుటుంబం గడిచేది. అయినా చంద్రయ్య మాత్రం ఏ పనీ చేయకుండా "నేను అదృష్టజాతకుడిని , ఏదో ఒకనాటికి నాకు కాలం కలిసొస్తుంది. అకస్మాత్తుగా నేను ధనవంతుడినైపోతానట- చూస్తూండండి. అందుకేగద, నేను ఇలా నిశ్చింతగా ఉంటున్నది!" అని అందరితో చెప్పుకుంటూ తిరిగేవాడు. ఒకసారి చంద్రయ్యను చూసి పోయేందుకు వాళ్ళింటికి వచ్చాడు శివరాం. శివరాం చంద్రయ్యకు చిన్ననాటి మిత్రుడు. చంద్రయ్య పద్ధతిని గమనించిన శివరాం అతన్ని చాలాసేపు మెచ్చుకొని, "చూడగా నువ్వనే అదృష్టం ఏదో నీ తలుపు తట్టే రోజు దగ్గరలోనే ఉన్నట్లుంది. ఏమైందో తెలుసా? -ఈ మధ్యే ఒక యోగిని సంప్రదించాను, నీ గురించి. ఆయనకూడా అదే చెప్పాడు- కోరిన కోరికలన్నిటినీ తీర్చే కామధేనువు ఈసారి మన ఊరి ప్రక్క అడవిలోకే రానున్నదట. ఈ దసరా నుండి సంక్రాంతిలోపలే ఏదో‌ ఒక రోజున

జ్ఞానం-పాండిత్యం

అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ శాంతి సౌఖ్యాలతో, సమ భావంతో, కలిసి మెలిసి జీవించేవాళ్లు. ఆ ఊరికి ఒక సాంప్రదాయం ఉండేది: మంచి పండితుల్ని , తత్త్వవేత్తలను అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి ఆహ్వానించేవాళ్ళు; వాళ్ల చేత ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇప్పించుకునేవాళ్లు. వాటి ద్వారా ఊళ్ళోవాళ్లంతా మంచి విలువలను పెంపొందించుకొనే వాళ్ళు. దీని వెనక ఉన్నది, ఆ ఊరి పెద్ద త్యాగయ్య. ఆయన బాగా చదువుకున్నవాడు, శాంత స్వభావి, మంచి తెలివైనవాడు కూడా. ఒకసారి ఆయన మంచి పేరు గడించిన పండితులు ఇద్దరిని తమ ఊళ ్ళో ప్రసంగించేందుకుగాను ఆహ్వానించారు. ఊళ్ళోవాళ్ళు ఉపన్యాస వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆరోజు ఉదయం పండితులిద్దరూ ఊరు చేరారు. త్యాగయ్యగారి ఇంట్లోనే వారికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పండితుల రాకతో తన ఇల్లు పావనమైందని అనుకున్నారు త్యాగయ్యగారు. కొద్ది సేపు అవీ-ఇవీ మాట్లాడిన తర్వాత వాళ్ళలో మొదటి పండితుడు స్నానాల గదిలోకి వెళ్ళాడు, స్నానం చేసేందుకు. అంతలో రెండవ పండితుడు రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి త్యాగయ్యతో ఇలా అన్నాడు: "ఇప్పుడు స్నానానికి వెళ్ళాడు చూశారా, పైకి పండితుడు! కానీ నిజానికి వీడు ఒక దున్నపో

మార్గం చూపిన మొసలి

మించలవారికోట గ్రామానికి చివరలో ఒక చెరువు ఉండేది. చెరువు గట్టున గణేష్ వాళ్ళు రోజూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజున వాడు బంతినొకదాన్ని తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఆ సమయానికి మిగిలిన పిల్లలెవ్వరూ రాలేదు ఇంకా. వాడొక్కడే అలా బంతితో ఆడుతుంటే, అది కాస్తా వెళ్ళి చెరువులో ఎక్కడో పడిపోయింది. గణేశ్ కు ఈత వచ్చు కదా, అందుకని బంతిని వెతుక్కుంటూ చెరువులోకి దిగాడు. అంతలో వాడికి దగ్గర్లో ఏదో కదులుతున్న అలికిడి వినబడింది. ఏంటా అని చూస్తే అది ఒక మొసలి! వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటోంది, ఆగి ఆగి. గణేశ్‌ పారిపోదామనుకున్నాడు. కానీ 'అది వలలో‌ చిక్కుకొని ఉన్నది కదా, భయపడేదేముందిలే' అని, దానికి దగ్గరగా వెళ్ళాడు, బురదలో నడుస్తూ. గణేశ్‌ను చూడగానే మొసలి బాధతోటీ సంతోషంతోటీ కన్నీళ్ళు కార్చింది. 'కాపాడు కాపాడు' అని మొరపెట్టుకున్నది. 'నన్ను రక్షించు, ప్లీజ్' అని వేడుకున్నది. గణేశ్‌కి కొంచెం భయం వేసింది. అయినా 'అది అంతగా వేడుకుంటున్నది గదా' అని జాలికూడా వేసింది. 'నువ్వు కౄరమృగానివి కదా! నిన్ను వలలోంచి విడిపించగానే నన్ను పట్టుకొని తినేస్తావేమో?' అన్నాడు. 'అయ్యో, న

భయం

అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చుట్టూ చెట్టూ, చేమా, పొలమూ పుట్రా ఉన్నాయి. ఆ పొలాల మధ్యలోంచే వూళ్ళోకి వచ్చే పోయే దారి వుంది. ఆ దారి వేరే వూళ్ళకు పోయే దారులను కలుపుతుంది. అలా కలిసే కూడల్లో మనుషులు ఒకరికొకరు ఎదురవుతారు. పలకరించుకుంటారు. ఒకరి పొడ ఒకరికి గిట్టకపోతే ముఖాలు తిప్పుకొని ఎవరిదారిన వాళ్ళు పోతూ వుంటారు. అది మనుషుల కథ. మామూలు కథ. మరి మనుషులకు వేరే జీవులు ఎదురయితే ఏమవుతుందో, ఇదే ఇంకో కథ. అవాళ- మనిషి, పాము ఒకరికొకరు ఎదురయిపోయారు. 'అమ్మో విషప్పురుగు. దాని కోరల్లో విషం..' అని భయంతో ఆగిపోయాడు మనిషి. 'అమ్మో విషప్పురుగు. మనకు కోరల్లోనే విషం. మనుషులకు నిలువెల్లా విషమే..' అని భయంతో ఆగిపోయింది పాము. ఇద్దరూ అలాగే రెండు క్షణాలసేపు ఒకరివంక ఒకరు చూస్తూ వుండిపోయారు. మనిషి వెనక్కి తగ్గుదామనుకున్నాడు. అడుగు తీసి అడుగు వెనక్కి వేద్దామనుకున్నాడు. కానీ పాము వెంట పడితే..? వెంటపడి కాటేస్తే..?' ఆలోచనలతో ఆగిపోయాడు. పాముకూడా వెనక్కి తగ్గుదామనుకుంది. జరజరా వెనక్కి వెళ్ళిపోదామనే అనుకుంది. కానీ మనిషి వెంటపడితే..? వెంటపడి కొడితే..?' ఆలోచనలతో ఆగిపోయింది. 'నన్ను కాటెయ్యద్దు

మోసం

సింహపురి రాజ్యాన్ని కనక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలందరూ సరిగ్గా పన్నులు చెల్లించేవాళ్ళు. దాంతో ఆయన కోశాగారం ఎల్లప్పుడూ ధనంతో నిండి ఉండేది. ఆ కోశాగారానికి సంరక్షకుడు సుబ్బన్న, ముసలివాడవుతున్నాడు. తన తరువాత కోశాగారపు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలిగే యువకుడిని ఎంపిక చేయమని సుబ్బన్న రాజుగారికి మనవి చేసుకొన్నాడు. రాజుగారు కొంచెం ఆలోచనలో పడ్డారు. సుబ్బన్న సమర్థుడూ, విశ్వాసపాత్రుడున్నూ. తన తండ్రిగారి హయాం నుంచీ కోశాగార బాధ్యతలు నిర్వహిస్తున్న సుబ్బన్న బలంగా ఉన్నంత కాలమూ తనకు కోశాగారం గురించి ఆలోచించవలసిన పని పడలేదు. ఇప్పుడిక కొత్త వారిని వెతకటం తప్పని సరి. అందుకని రాజుగారు చాటింపు వేయించారు:"రాజుగారికి ఆంతరంగికుడు ఒకడు కావాలి. చదువూ, బలమూ, తెలివి తేటలూ, నిజాయితీ, దురలవాట్లు లేకుండా ఉండటం- ఇవీ అవసరాలు". ఇంకేముంది, రాజ్యంలోని యువకులు అందరూ పోటీపడ్డారు. ఆ పోటీలు అన్నింటిలోనూ ఉత్తములుగా ఎంపికైన నలుగురిని రాజుగారి సమక్షంలో నిలబెట్టారు రాజోద్యోగులు. మహారాజుగారు వారి దేహ దారుఢ్యాన్నీ, చదువునీ, తెలివితేటల్నీ పరిశీలించారు. అన్నింటిలోనూ ఎవరి

దురాశ

అనగనగా ఒక ఊరు . ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని సీతయ్య . ప్రతి రోజూ అతను దగ్గరలోని అడవికి వెళ్ళి, కట్టెలు కొట్టుకొచ్చి, వాటిని గ్రామంలో అమ్మి, తన కుటుంబాన్ని పోషించేవాడు. అంత పేదరికంలో కూడా ఇతరులకు సాయపడేవాడు. ఒక ఏడాది కరువు వచ్చి పంటలు సరిగ్గా పండలేదు. ఊళ్లో జనాల దగ్గర డబ్బు లు తక్కువ అవ్వటంతో, ఆ ప్రభావం సీతయ్య కట్టెల వ్యాపారం మీద పడింది. కట్టెలు కొనేవాళ్ళ సంఖ్య బాగా తగ్గి పోయింది. సీతయ్య కుటుంబానికి పూట గడవటమే కష్టమైపోయింది. ఒకనాడు సీతయ్య కట్టెల కోసం అడవికి వ ెళ్ళాడు. కట్టెలు కొడుతుండగా మధ్యలో దాహం వేసింది. దగ్గర్లోని చెలమకు పోయి, నీళ్ళు తాగి, "అమ్మా! ఎంత కష్టంవచ్చిందమ్మా నాకు!" అని నిట్టూర్ఛాడు. వెంటనే ఒక వనదేవత ప్రత్యక్షమయింది: 'ఏమి కావాలో కోరుకో'మన్నది! సీతయ్య తన కష్టాలన్నింటినీ ఆ దేవతకు చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత సీతయ్యకు మూడు టెంకాయలు ఇచ్చి "ఈ మూడు టెంకాయలనూ కొడుతూ నువ్వు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది నాయనా" అని చెప్పి మాయమై పోయింది. సీతయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళి టెంకాయలను కొడుతూ, తనకు ఒక పెద్ద భవనమూ, దండిగా సంపదా, తమ ప్రా

పిసినారి పుల్లయ్య

ఒక ఊళ్లో ఓ పిసినారి పుల్లయ్య ఉండేవాడు. అతను ఎవ్వరికీ ఏదీ ఇచ్చేవాడు కాదు. ఎప్పుడూ 'ఎట్లా పైసలు మిగల బెట్టాలా' అనే ఆలోచించేవాడు. అతని పిసినారితనం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయేవాళ్ళు. అట్లాంటి పిసినారి పుల్లయ్య కూడా సంవత్సరానికి ఒకసారి పండగరోజున దేవుడికి ఒక టెంకాయ కొట్టేవాడు. ఒకసారి అట్లాంటి పండుగ వచ్చింది. టెంకాయ కావాలి. పుల్లయ్య తమ ఊళ్ళోని దుకాణానికి వెళ్ళి "టెంకాయ ఎంత?" అని అడిగాడు. "నాలుగు రూపాయలు" అన్నాడు దుకాణదారు. "మూడు రూపాయలకు ఇస్తావా?" అడిగాడు పుల్లయ్య. పుల్లయ్య తత్వం తెలిసిన దుకాణదారు నవ్వాడు. "మన ఊళ్ళో అంతటా నాలుగు రూపాయలేనయ్యా! ప్రక్క ఊర్లో మూడు రూపాయలకు దొరకచ్చు చూడు" అన్నాడు. పుల్లయ్యకు ఆ ఆలోచన నచ్చింది. తను నడుచుకుంటూ ప్రక్క ఊరికి వెళ్ళాడు- "టెంకాయ ఎంత?" అంటే అక్కడి దుకాణదారు "మూడు రూపాయలు" అన్నాడు. "రెండు రూపాయలకు ఇచ్చెయ్యరాదూ?" అన్నాడు పుల్లయ్య, అలవాటుగా. దుకాణంవాడు పుల్లయ్యకేసి వింతగా చూస్తూ-"ఆ ధరకి ఇక్కడ రాదు- మూడు ఊళ్ళ అవతల రామాపురంలో ఉంది ఆ రేటు" అన్నాడు. పుల్లయ్యకు డబ్బ

పట్టిందల్లా బంగారం

అనగా అనగా ఒక ఊళ్లో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. బంగారు వ్యాపారం చేసేవాడు; ఎంతో కూడ బెట్టాడు-కానీ అతనికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది. భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది. ఆయనకు తన కూతురు అంటే కూడా చాలా ఇష్టం. ఒక రోజున, భూపతి దేవుణ్ని ప్రార్థిస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఆ దేవుడే ప్రత్యక్షమయ్యాడు: "భూపతీ! నీ భక్తి నాకు నచ్చింది. నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది. ఏం వరంకావాలో కోరుకో" అన్నాడు దేవుడు. భూపతి సంతోషంతో పులకించి పోయాడు. "ఏం వరం అడిగినాఇస్తారు కదా స్వామీ!" అని అడిగాడు, ముందస్తుగా. "వరాన్ని బట్టి ఉంటుంది. కోరుకో, ముందు" అన్నాడు దేవుడు. "నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా"అని కోరుకున్నాడు భూపతి. "సరే, నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను మరి- జాగ్రత్తగా ఉపయోగించుకో " అని చెప్పి దేవుడు మాయమయిపోయాడు. భూపతికి చాలా సంతోషం వేసింది. 'ప్రయత్నించి చూద్దాం' అని చెప్పి ఒక గాజు బొమ్మను ముట్టుకున్నాడు- తక్షణం ఆ గాజుబొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది! మంచాలనీ, కుర్చీలనీ ముట్టుకున్నాడు. అవికూడా వెంటనే

అల్లరి కోతి

ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవి ఒక రోజు సమావేశం అయ్యాయి: అడవిలో‌ ఒక స్కూలు పెట్టుకోవాలని అనుకున్నాయి. అన్నీ‌ కలిసి సింహం రాజుగారిని అనుమతి అడిగాయి. సింహం ఒప్పుకున్నాడు. వెంటనే స్కూలు కూడా మొదలైంది. స్కూల్లో కోతి బాగా అల్లరి చేసేది; వేరే వాళ్ళ పెన్సిళ్ళను, పెన్నులను దొంగిలించేది. టక్కరి నక్క పోయి, కోతి దొంగతనం గురించి సింహం రాజుకు ఫిర్యాదు చేసింది. అప్పుడు రాజు కోతితో "ఇంకోసారి అల్లరి చేస్తే పట్టణంలోకి పంపుతాం" అన్నాడు. రాజు అలా అనగానే కోతి చాలా సంబరపడింది. దానికి పట్నం అంటే చాలా ఇష్టం మరి! అందుకని కోతి ఇంకా ఎక్కువ అల్లరి చేయటం మొదలు పెట్టింది. ఇక తట్టుకోలేని జంతువులన్నీ కలిసి న్యాయవిచారణ చేసి, కోతిని అడవిలోంచి తరిమేశాయి. పట్నం చేరుకున్న కోతికి మొదట్లో‌ చాలా సంతోషం కలిగింది. అక్కడి దుకాణాలు, వాహనాలు చూస్తూ‌ అది తనను తాను మరచి పోయింది. అంతలోనే దాన్ని ఒకపిల్లవాడు పట్టుకున్నాడు. కోతితో సర్కస్ చేపించి బాగా డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు వాడు. కోతికి కూడా మొదట్లో ఆ ఆట ఇష్టమే అయ్యింది, కాని వాడు రాను రాను దానికి తక్కువ అన్నం పెడుతుండేసరికి, అది చాలా బాధ పడింది.

విశాల హృదయం-విశాల రాజ్యం

-------------------------------- అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు విశాల రాజ్యం. ఆరాజ్యానికి రాజు విశాలుడు. పేరుకు తగ్గట్లుగా ఆ రాజు హృదయం విశాలమైనది. రాజు రాజ్యాన్ని బాగా పరిపాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకు తగిన విధంగానే ప్రజలు కూడా ఆయన పట్ల వినయ విధేతలు కలిగి ఉండేవాళ్లు. కష్టపడి పని చేసేవాళ్ళు. రైతులందరితో పాటు రాజు కూడా వ్యవసాయం చేసేవాడు. మంచి మంచి పంటలు పండించేవాడు. రైతులందరికి పంటలు పండించడంలో మెళుకువలు చెప్పి, మం చి నాణ్యమైన పంటలు పండించేట్లు చూసేవాడు విశాలుడు. తను రాజునన్న గర్వం ఏనాడూ ఉండేది కాదు ఆయనకు. ఇతర రాజ్యాలలో వున్న వ్యాపారస్తులంతా నాణ్యమైన సరుకు కోసం విశాల రాజ్యానికి వచ్చేవారు. అందువల్లకూడా, విశాలరాజ్యంలోని రైతులకు మంచి లాభాలు వచ్చేవి. ఆ ఉత్సాహంతో రైతులు ఇంకా నాణ్యమైన పంటలను పండించేవారు. ఆ విధంగా ఆ రాజ్యం నాణ్యమైన సరకులకు పెట్టిన పేరైంది. కొన్నిసంవత్సరాల తరువాత ఆ రాజు ఆ రాజ్యంలోని రైతులందరినీ సమావేశపరిచి, "నేను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రాజ్యం వదలి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. ఈ రోజు సుదినం.

తాబేలు తెలివి

ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ల్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి "ఏమిటీ విడ్డూరం! తాబేలు పిల్లనగ్రోవి వాయించటం ఏమిటీ!" అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లనగ్రోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దాన ికి అర్ధం కాలేదు. వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు. "ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను" అని అన్నాడు వేటగాడు తన భార్య, పిల్లలతో. "చచ్చానురా" అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, "పిల్లలూ! ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను" అని తన పిల్లలతో చెప్పి బజారుకు

చతురతకి బహుమతి

పూర్వం ఒక రాజుగారికి విచిత్రమైన ప్రకటనలు చేయటం సరదాగా ఉండేది. ఒకసారి ఆయన అతి పెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలను బహుమతిగా ప్రకటించాడు. ఎందరో రాజాస్ధానానికి వచ్చ్హి అబద్ధలు చెప్పారు. కాని ఎవరూ బహుమతిని అందుకునేంత పెద్ద అబద్ధం చెప్ప లేదని ఆ రాజు భావించాడు. ఒక రోజు, రాజు తన సింహాసనంపై కూర్చుని ఉండగా, ఒక యువకుడు వచ్చాడు. ప్రభూ! మీరు ఒక విషయానికి బహుమతి ప్రకటించారని విన్నాను అని అడిగాడు అవును. అతిపెద్ద అబద్ధం చెప్పిన వారికి 500 బంగారు నాణాలు కాని దానికన్నా ముందు మీరు 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు వాదించాడు యువకుడు. పెద్ద అబద్ధం. నేనెప్పుడూ అలా ప్రకటించలేదు యువకుడి ఆలోచన పసికట్టలేని రాజు వెంటనే అన్నాడు. అప్పుడా యువకుడు ప్రభూ! మీరే ఒప్పుకున్నారు. నేను అతి పెద్ద అబద్ధం చెప్పానని. కాబట్టి దయచేసి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇప్పించండి అన్నాడు. రాజుగారు అతని చతురతకి ముచ్చటపడి 500 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. నీతి : సమయస్పూర్తితో కూడిన చతురత అన్నివేళలా విజయం సాధిస్తుంది.

నిధికి దారి

గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, 'అంతులేని నిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం?' అన్నాడు. ఆ  మాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య 'వూరు పనికి రానిదిగా మారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?' అన్నాడు. 'నా దివ్యదృష్టికి అంతా కనిపిస్తోంది. మీలో ఒకరి కళ్లకు అంజనం రాస్తే నిధులెక్కడున్నాయో తెలుస్తుంది' అన్నాడు సన్యాసి. గ్రామస్థులంతా త్రిగుణయ్యకి అంజనం రాయమని కోరారు. సన్యాసి తన జోలె లోంచి ఓ చిన్న భరిణె తీసి అందులోని కాటుకని త్రిగుణయ్యకి రాశాడు. త్రిగుణయ్య వెంటనే 'ఆహా! అద్భుతం. నిధికి దారి స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వడమే తరువాయి' అన్నాడు. ఆ మాటలకు గ్రామస్థులంతా సంబరపడి పోయి పలుగు, పార, గునపాలు, తట్టలు పుచ్చుకుని తరలి వచ్చారు. మర్నాడే పని ప్రారంభమైంది. త్రిగుణయ్య చెప్పిన చోట తవ్వుకుంటూ గ్రామస్థులు చెమటోడ్చి పని చేశారు. నిధికి దారి బీడు భూముల మీదుగా వూరికి దాపుల నున్న కొండల మధ్య నుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం వూరి పనికి అడ్డం వచ్చింది. కొంద

బిక్షాపాత్ర కధ

రాజుగారు ఉద్యానవనం నుంచి తిరిగి రాజప్రాసాదంలో అడుగిడే ముందు... అతని కి వున్నట్టుండి ఒకడు ఎదురుపడ్డాడు. చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు. బాగా ఉల్లాసంగా వున్న రాజుగారికి అతగాడికి ఎదైనా సాయం చేయాలని అనిపించింది. ‘ఏం కావాలి నీకు ?కోరుకో!ఏదయినా సరే ఇస్తాను’ అన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ. ‘రాజా! తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో’ అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. రాజు అన్నాడు అతడితో.‘పరవాలేదు అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.’ ‘సరే! రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వేయండి. దీన్ని నింపండి. నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి’ రాజు విలాసంగా నవ్వాడు. నవ్వి అన్నాడు. ‘ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుందనుకోను’ రాజు అతడిని వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు. కృష్ణ తులాభారం మాదిరిగా సన్నివేశం మారిపోయింది. ఒకటికి రెండుసార్లు

నిజం ఎప్పటికీ దాగదు

ఒకసారి గంగాధరం, దశరధం అనే బాటసారులు ప్రయాణం చేస్తూ, చీకటి పడేసరికి ఒక అన్నసత్రంలో భోజనం చేసి పడుకున్నారు. వారిద్దరివీ వేర్వేరు ఊళ్లు, పరిచయస్ధులు కుడా కారు. గంగాధరం చెవులకు బంగారు పోగులున్నాయి. సత్రంలోకి వచ్చినప్పటి నుండి దశరధం దృష్టి గంగాధరం బంగారుపోగులపైనే ఉంది. ఎలాగైనా వాటిని కాజేయాలని గంగాధరంతో స్నేహం నటించి అతని పక్కనే పడుకున్నాడు దశరధం. ప్రయాణ బడలిక వల్ల గంగాధరానికి గాఢంగా నిద్రపట్టింది. బాటసారులంతా గుర్రు పెట్టి నిద్రపోతున్న సమయంలో దశరధం, కుడి చెయ్యి తలకింద పెట్టుకుని నిద్రపోతున్న గంగాధరం ఎడమచెవిపోగును జాగ్రత్తగా కాజేశాడు. అతను ఎటూ కదలకుండా అలాగే పడి ఉండటం వల్ల కుడిచెవిపోగు కాజేయలేకపోయాడు. తెల్లవారాక తన ముఖం చూసుకున్న గంగాధరానికి ఎడమచెవిపోగు లేకపోవడం కనిపించింది. పక్కనే ఉన్న దశరధం కుడిచెవికి తన ఎడమపోగు ఉండడం చూసి, “నీవు నా చెవి పోగు దొంగిలించావు కదా ! నా చెవిపోగు నాకిచ్చేయి.” అన్నాడు గంగాధరం కోపంగా. దశరధం మరింత కోపంగా, “ఏం మాట్లాడుతున్నావ్‌ ? నువ్వే నా చెవిపోగు తీసుకుని ఎక్కువగా మాట్లాడుతావా ?” అంటూ గంగాధరం పైపైకి ఎగిరాడు. కొంతసేపు వాదులాట తర్వాత గంగాధరం, దశరధం న్యాయాధిపత

నిజం దాగదు

సీతమ్మ చక్కని చుక్క. పైగా గర్భవతి. అయినా ఆమె మొగుడు ఆమెను చీదరించుకునేవాడు. అత్త-మామ ఇద్దరూ ఆశపోతులు. అడిగినంత కట్నం తేలేదని ఆమెను ఎప్పుడూ తిడుతుండేవాళ్ళు. 'నువ్వు చచ్చిపోతే మా కొడుక్కి మళ్ళీ పెళ్ళి చేస్తాం" అని సాధించేవాళ్ళు. సీతమ్మ ఇవన్నీ భరిస్తూ జీవితాన్ని ఎలాగో ఒకలా నెట్టుకొచ్చేది. సీతమ్మకు మాంసంకూర అంటే చాలా ఇష్టం. ఒకరోజున అత్త మామ మాంసం కూర చేశారు. తీరా సీతమ్మ తినాలనుకునేసరికి, వాళ్ళు "కందికట్టె పూర్తిగా అయిపోయింది- చేనుకెళ్ళి కందికట్టె తీసుకురా" అని పంపించారు. సీతమ్మ చేనుకు వెళ్ళి తిరిగి వచ్చేలోగా ఆమె అత్త, మామ, భర్త ముగ్గురూ కూరను పూర్తిగా లాగించేశారు. అంతేకాకుండా, రోడ్డుమీద దొరికిన పామునొకదాన్ని ముక్కలు చేసి, దాన్ని వండి పెట్టారు సీతమ్మకోసం! ఆకలిగా ఉన్న సీతమ్మ పాపం, ఆ పాము చారునే తిన్నది. తినగానే ఆమెకు వాంతులు-బేదులు మొదలయ్యాయి. నాలుగైదు గంటలపాటు ఆమె బాధపడినా అత్తమామలుగాని, భర్తగాని ఆమెను పట్టించుకోలేదు. చివరికి ఊరి చివరనున్న తోటలోకి పరుగెత్తిన సీతమ్మ అక్కడే చనిపోయింది. "అయ్యో నా భార్య! చనిపోయింది" అని దొంగ ఏడుపులు ఏడిచి, భర్త, అత్త-