Skip to main content

Posts

Showing posts from October, 2014

అత్తారింటికి దారేది?

ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా నిశబ్దంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది. యమున నది తీరంలో ఉన్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది ఎడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్ కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి , “ ఇదేమిటి , యమునా నది ఇంత గట్టిగా ఎడుస్తోంది ” అనుకున్నాడు. ఎంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు. మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి , “ మీలో ఎవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా ?” అని అడిగారు. సభికులు తెల్లబోయి , సమాధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు. బీర్బల్ ముందుకొచ్చి , “ మహారాజా , ఒక సారి వింటే కాని నేను చెప్పలేను ” అని అన్నాడు. అక్బర్ వెంటనే బీర్బల్ ని ఆ రాత్రి అంతఃపురంకి రమ్మని ఆహ్వానించాడు. రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమునా నది హోరును విన్నాడు. విషయం అర్ధమయ్యింది. మహారాజా , యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని , పుట్టింటిని వదిలి వె

అఙ్నానం, మూర్ఖత్వం

అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ వుండేవి. బెక బెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ వుండేది. ఒక రోజు ఒక పిల్ల కప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగింది. తల్లి కప్ప వెంటనే – “చాలా దూరం వెళ్ళితే తప్పి పోతావు. ఇక్కడిక్కడే తిరుగు – నాకు నిన్ను వెతకటం కష్టం.” అంది. పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలా సేపు బతిమాలింది. చివరికి విసుకు చెంది, తల్లి కప్ప కసురుకుంది. “నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు. నువ్వూ నా మాట విను” అంది. పిల్ల కప్ప చాలా మొండిది. అమ్మ మాటలకు ఇంకా పంతం పట్టింది. “అనుమతిని అడిగితే ఇలాగే వుంటుంది. అనుమతినే కదా అడిగాను, ఎందుకు అమ్మ అంతా విసుక్కోవాలి” అని తనలో తను గొణుగ్గుంటూ మడుగంతా తిరుగుతూ అంచుల దెగ్గిరకి వెళ్ళిపోయింది. ఎదురుగా గట్టు మీద ఒక మనిషిని చూసింది. పిల్ల కప్ప అదే మొదటి సారి ఒక మనిషి ని చూడటం. ఆ ఎత్తూ ఆకారం చూసి చాలా జడుసుకుంది. ఖంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, చూసింది చెప్పింది. తల్లి కప్ప కూడా ఏనాడూ మనిషిని చూడలేదు గా, అందుకే, “ఎంత లావున్నాడు?” – పొట్ట వుబ్బించింది. “ఇంత వున్నాడా?” “ఊహూ” అని అడ్డంగా తల ఊపింది పిల్ల కప్