రావులపాలెంలో ఉండే చంద్రయ్య చాలా వింత మనిషి . అతనికి ఐదు ఆవులు ఉండేవి. అయినా అతను మాత్రం వాటి ఆలనా పాలనా పట్టించుకునేవాడు కాడు. భర్తను ఏమీ అనలేని లక్ష్మమ్మ ఇరుగు పొరుగుల్ని ప్రాధేయపడి, వాళ్ల పొలాల నుండి రోజూ కాస్తంత గడ్డి తెచ్చి వేసి ఎలాగో ఒకలాగా ఆవుల్ని సాకేది. వాటి పాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బులతోటే కుటుంబం గడిచేది. అయినా చంద్రయ్య మాత్రం ఏ పనీ చేయకుండా "నేను అదృష్టజాతకుడిని , ఏదో ఒకనాటికి నాకు కాలం కలిసొస్తుంది. అకస్మాత్తుగా నేను ధనవంతుడినైపోతానట- చూస్తూండండి. అందుకేగద, నేను ఇలా నిశ్చింతగా ఉంటున్నది!" అని అందరితో చెప్పుకుంటూ తిరిగేవాడు. ఒకసారి చంద్రయ్యను చూసి పోయేందుకు వాళ్ళింటికి వచ్చాడు శివరాం. శివరాం చంద్రయ్యకు చిన్ననాటి మిత్రుడు. చంద్రయ్య పద్ధతిని గమనించిన శివరాం అతన్ని చాలాసేపు మెచ్చుకొని, "చూడగా నువ్వనే అదృష్టం ఏదో నీ తలుపు తట్టే రోజు దగ్గరలోనే ఉన్నట్లుంది. ఏమైందో తెలుసా? -ఈ మధ్యే ఒక యోగిని సంప్రదించాను, నీ గురించి. ఆయనకూడా అదే చెప్పాడు- కోరిన కోరికలన్నిటినీ తీర్చే కామధేనువు ఈసారి మన ఊరి ప్రక్క అడవిలోకే రానున్నదట. ఈ దసరా నుండి సంక్రాంతిలోపలే ఏదో ఒక రోజున ...