Skip to main content

Posts

Showing posts with the label తాబేలు

తాబేలు తెలివి

ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ల్లాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లనగ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి "ఏమిటీ విడ్డూరం! తాబేలు పిల్లనగ్రోవి వాయించటం ఏమిటీ!" అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లనగ్రోవి పాడుతు మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దాన ికి అర్ధం కాలేదు. వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లనగ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు. "ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లనగ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను" అని అన్నాడు వేటగాడు తన భార్య, పిల్లలతో. "చచ్చానురా" అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, "పిల్లలూ! ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను" అని తన పిల్లలతో చెప్పి బజారుకు ...