ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవి ఒక రోజు సమావేశం అయ్యాయి: అడవిలో ఒక స్కూలు పెట్టుకోవాలని అనుకున్నాయి. అన్నీ కలిసి సింహం రాజుగారిని అనుమతి అడిగాయి. సింహం ఒప్పుకున్నాడు. వెంటనే స్కూలు కూడా మొదలైంది. స్కూల్లో కోతి బాగా అల్లరి చేసేది; వేరే వాళ్ళ పెన్సిళ్ళను, పెన్నులను దొంగిలించేది. టక్కరి నక్క పోయి, కోతి దొంగతనం గురించి సింహం రాజుకు ఫిర్యాదు చేసింది. అప్పుడు రాజు కోతితో "ఇంకోసారి అల్లరి చేస్తే పట్టణంలోకి పంపుతాం" అన్నాడు. రాజు అలా అనగానే కోతి చాలా సంబరపడింది. దానికి పట్నం అంటే చాలా ఇష్టం మరి! అందుకని కోతి ఇంకా ఎక్కువ అల్లరి చేయటం మొదలు పెట్టింది. ఇక తట్టుకోలేని జంతువులన్నీ కలిసి న్యాయవిచారణ చేసి, కోతిని అడవిలోంచి తరిమేశాయి. పట్నం చేరుకున్న కోతికి మొదట్లో చాలా సంతోషం కలిగింది. అక్కడి దుకాణాలు, వాహనాలు చూస్తూ అది తనను తాను మరచి పోయింది. అంతలోనే దాన్ని ఒకపిల్లవాడు పట్టుకున్నాడు. కోతితో సర్కస్ చేపించి బాగా డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు వాడు. కోతికి కూడా మొదట్లో ఆ ఆట ఇష్టమే అయ్యింది, కాని వాడు రాను రాను దానికి తక్కువ అన్నం పెడుతుండేసరికి, అది చాలా బాధ పడింది. ...