Skip to main content

Posts

Showing posts with the label మొసలి

మార్గం చూపిన మొసలి

మించలవారికోట గ్రామానికి చివరలో ఒక చెరువు ఉండేది. చెరువు గట్టున గణేష్ వాళ్ళు రోజూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజున వాడు బంతినొకదాన్ని తీసుకొని వెళ్ళాడు అక్కడికి. ఆ సమయానికి మిగిలిన పిల్లలెవ్వరూ రాలేదు ఇంకా. వాడొక్కడే అలా బంతితో ఆడుతుంటే, అది కాస్తా వెళ్ళి చెరువులో ఎక్కడో పడిపోయింది. గణేశ్ కు ఈత వచ్చు కదా, అందుకని బంతిని వెతుక్కుంటూ చెరువులోకి దిగాడు. అంతలో వాడికి దగ్గర్లో ఏదో కదులుతున్న అలికిడి వినబడింది. ఏంటా అని చూస్తే అది ఒక మొసలి! వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకుంటోంది, ఆగి ఆగి. గణేశ్‌ పారిపోదామనుకున్నాడు. కానీ 'అది వలలో‌ చిక్కుకొని ఉన్నది కదా, భయపడేదేముందిలే' అని, దానికి దగ్గరగా వెళ్ళాడు, బురదలో నడుస్తూ. గణేశ్‌ను చూడగానే మొసలి బాధతోటీ సంతోషంతోటీ కన్నీళ్ళు కార్చింది. 'కాపాడు కాపాడు' అని మొరపెట్టుకున్నది. 'నన్ను రక్షించు, ప్లీజ్' అని వేడుకున్నది. గణేశ్‌కి కొంచెం భయం వేసింది. అయినా 'అది అంతగా వేడుకుంటున్నది గదా' అని జాలికూడా వేసింది. 'నువ్వు కౄరమృగానివి కదా! నిన్ను వలలోంచి విడిపించగానే నన్ను పట్టుకొని తినేస్తావేమో?' అన్నాడు. 'అయ్యో, న...