Skip to main content

Posts

Showing posts with the label ధనవంతురాలి గిన్ని

ధనవంతురాలి గిన్ని

అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలుండేది. ఒక రోజు ఆవిడ దెగ్గిర పొరుగింటామె వచ్చి ఒక గిన్న అడిగి తీసుకుంది. తిరిగిచ్చేడప్పుడు ఆ గిన్నెతో పాటు మరో చిన్న గిన్నెను కూడా ఇచ్చింది. ధనవంతురాలు చాలా ఆష్చర్యపోయింది. రెండు గిన్నెలిచ్చావేంటి? అనడిగితే గిన్నె పిల్లని పెట్టింది అందుకనే ఇస్తున్నను అని బదులు చెప్పింది. కొన్ని రోజులు గడిచాయి. పొరుగింటామె మళ్ళీ ఒక రోజు గిన్నె కోసమొచ్చింది. ధనవంతురాలు చాలా సంతోషంగా గిన్నెను ఇచ్చింది. ఈ సారి తిరిగిచ్చేడప్పుడు ఎలాంటి గిన్నెను ఇస్తుందోనని ఆత్రుతతో ఎదురుచూసింది. కాని పొరుగింటామె అసలు గిన్నెను తిరిగివ్వలేదు. చాలా రోజులు చూసాక ఆ ధనవంతురాలే వెళ్ళి గిన్నె గురించడిగింది. పొరుగింటామె యేడుపుమొహము పెట్టి మీ గిన్నె చనిపోయిందండి అని దుఖసమాచారము చెప్పింది. గిన్నె చనిపోవడమేమిటని ధనవంతురాలు మహా ఆష్చర్యంగా అడిగింది. దానికి పొరుగింటామె గిన్ని పిల్లలిని పెట్టగా లెనిది చనిపోతె ఆష్చర్యమెందుకు? అనడిగింది. ఇది విన్న ధనవంతురాలు యేమి మాట్లాడలేక ఇంటికి వెళ్ళిపోయింది.