Skip to main content

Posts

Showing posts with the label lord shiva storys

మహాశివుడు కిరాతకుడిగా ఎందుకు మారాడు?

''దేవేంద్రుని దగ్గర దివ్య వస్త్రాలు తీసుకో''మని ధర్మరాజు చెప్పడంతో అర్జునుడు ఇంద్రసభకు బయల్దేరాడు. అయితే, అందుకోసం ముందుగా పరమశివుని ప్రసన్నం చేసుకోమని చెప్పాడు ఇంద్రుడు. అర్జునుడు మహాశివునికోసం ధ్యానం చేశాడు. కానీ, శివుడు వెంటనే అర్జునుని కరుణించదలచలేదు. ఒక పరీక్ష పెట్టాడు. శివుడు పెట్టిన పరీక్ష ఏమిటంటే - అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న ప్రదేశానికి మూకాసురుని సూకర రూపంలో పంపించాడు. మహాశివుని ఆజ్ఞ మేరకు మూకాసురుడు పంది రూపంలో అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలో తిరగసాగాడు. మహాశివుడు కిరాతకుడిగా (వేటగాడిగా) మారాడు. ఆ మారడంలో శివుడి అలంకారాలన్నీ రూపు మారాయి. త్రిశూలం విల్లంబుగా, నెలవంక నెమలి ఈకగా, రుద్రాక్షమాల పూసల దండగా మారాయి. ఇక పార్వతీదేవి కిరాతకుని భార్యగా అవతరించింది. శబ్దం చేస్తూ అటూఇటూ తిరిగుతున్న పంది తపోభంగం గావించడంతో అర్జునుడు విసిగిపోయి, బాణం వేశాడు. ఆ పందినే వేటాడుతూ వచ్చినట్లు కిరాతకుడు కూడా పందికి బాణాలు వేశాడు. అటు అర్జునుడు, ఇటు కిరాతకుడు వేసిన బాణాలు తగిలి సూకరం కాస్తా ప్రాణాలు కోల్పోయింది. ఇక ఆ పందిని నేను చంపాను అంటే నేను చంపాను...