Skip to main content

Posts

Showing posts with the label పాండిత్యం

జ్ఞానం-పాండిత్యం

అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ శాంతి సౌఖ్యాలతో, సమ భావంతో, కలిసి మెలిసి జీవించేవాళ్లు. ఆ ఊరికి ఒక సాంప్రదాయం ఉండేది: మంచి పండితుల్ని , తత్త్వవేత్తలను అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి ఆహ్వానించేవాళ్ళు; వాళ్ల చేత ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇప్పించుకునేవాళ్లు. వాటి ద్వారా ఊళ్ళోవాళ్లంతా మంచి విలువలను పెంపొందించుకొనే వాళ్ళు. దీని వెనక ఉన్నది, ఆ ఊరి పెద్ద త్యాగయ్య. ఆయన బాగా చదువుకున్నవాడు, శాంత స్వభావి, మంచి తెలివైనవాడు కూడా. ఒకసారి ఆయన మంచి పేరు గడించిన పండితులు ఇద్దరిని తమ ఊళ ్ళో ప్రసంగించేందుకుగాను ఆహ్వానించారు. ఊళ్ళోవాళ్ళు ఉపన్యాస వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆరోజు ఉదయం పండితులిద్దరూ ఊరు చేరారు. త్యాగయ్యగారి ఇంట్లోనే వారికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పండితుల రాకతో తన ఇల్లు పావనమైందని అనుకున్నారు త్యాగయ్యగారు. కొద్ది సేపు అవీ-ఇవీ మాట్లాడిన తర్వాత వాళ్ళలో మొదటి పండితుడు స్నానాల గదిలోకి వెళ్ళాడు, స్నానం చేసేందుకు. అంతలో రెండవ పండితుడు రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి త్యాగయ్యతో ఇలా అన్నాడు: "ఇప్పుడు స్నానానికి వెళ్ళాడు చూశారా, పైకి పండితుడు! కానీ నిజానికి వీడు ఒక దున్నపో...