అనగనగా ఒక ఊరు . ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని సీతయ్య . ప్రతి రోజూ అతను దగ్గరలోని అడవికి వెళ్ళి, కట్టెలు కొట్టుకొచ్చి, వాటిని గ్రామంలో అమ్మి, తన కుటుంబాన్ని పోషించేవాడు. అంత పేదరికంలో కూడా ఇతరులకు సాయపడేవాడు. ఒక ఏడాది కరువు వచ్చి పంటలు సరిగ్గా పండలేదు. ఊళ్లో జనాల దగ్గర డబ్బు లు తక్కువ అవ్వటంతో, ఆ ప్రభావం సీతయ్య కట్టెల వ్యాపారం మీద పడింది. కట్టెలు కొనేవాళ్ళ సంఖ్య బాగా తగ్గి పోయింది. సీతయ్య కుటుంబానికి పూట గడవటమే కష్టమైపోయింది. ఒకనాడు సీతయ్య కట్టెల కోసం అడవికి వ ెళ్ళాడు. కట్టెలు కొడుతుండగా మధ్యలో దాహం వేసింది. దగ్గర్లోని చెలమకు పోయి, నీళ్ళు తాగి, "అమ్మా! ఎంత కష్టంవచ్చిందమ్మా నాకు!" అని నిట్టూర్ఛాడు. వెంటనే ఒక వనదేవత ప్రత్యక్షమయింది: 'ఏమి కావాలో కోరుకో'మన్నది! సీతయ్య తన కష్టాలన్నింటినీ ఆ దేవతకు చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత సీతయ్యకు మూడు టెంకాయలు ఇచ్చి "ఈ మూడు టెంకాయలనూ కొడుతూ నువ్వు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది నాయనా" అని చెప్పి మాయమై పోయింది. సీతయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళి టెంకాయలను కొడుతూ, తనకు ఒక పెద్ద భవనమూ, దండిగా సంపదా, తమ ప్రా...