Skip to main content

Posts

Showing posts with the label Akbar-birbal

చిక్కు ప్రశ్న

ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలాకాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్మహారాజుకి ఒక ఆలొచన వచ్చింది.సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దం అనుకున్నారు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి,“బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?”అని అడిగారు. బీర్బల్ రెప్ప ఆర్చకుండ వెంటనే “సామ్రాట్, మనరాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందలనలభై మూడు కాకులు వున్నాయి” అనిబదులు చెప్పరు.] ఆష్చర్య పోయిన అక్బర్ మహారాజు, “అంతకచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువకాకులుంటే?” అని అడిగారు. "అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోనికాకుల చుట్టాలు వచ్చినట్టు” అన్నారు బీర్బల్.“ఒక వేళ తక్కువ వుంటే?” అని అడిగారు అక్బర్“అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ!” అని చెప్పారు బీర్బల్. ఈ కథను ఈ రోజు వరకు బీర్బల్ తెలివితేటలకు, స్థిత ప్రగ్న్యతకు ఉదాహరణగా చెప్పుకుంటారు.నిజమే, తెలివిగా అక్బర్ మహారాజు వేశినచిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కద! మీరేమంటారు?

అక్బర్ సందేహం

ఒక రోజు అక్బర్ బీర్బల్ ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు. “బీర్బల్, నాకొక సందేహముంది, తీరుస్తావా? అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాలలో వుందని విన్నాను. యెందుకలా? అక్కడ సేవకులెవరూ లేరా?” అని అక్బర్ బీర్బల్ ని అడిగారు. బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు, “సమ్రాట్, మీ సందేహం నేను సమయమొచ్చినప్పుడు తీరుస్తాను!” కొన్ని రోజులు గడిచాయి. బీర్బల్ ఒక పనిమనిషిని పిలిచి ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు. బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది. “ఈ రోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు, ఈ బొమ్మని తీసుకుని నీట్లో పడిపోయినట్టు నటించు, నీకు మంచి బహుమానమిప్పిస్తాను,” అని ఆ పనిమనిషికి చెప్పాడు. అలాగే పనిమనిషి సాయంత్రం అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే తోట నడిమధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్టు నటించింది. తనతో పాటు ఆ శిశువు బొమ్మకూడ నీళ్ళల్లో పడిపోయింది. అక్బర్ ఈ దృశ్యం చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్ళల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడ సాగాడు. బీర్బల్ మడుగు గట్టున నిలుచుని, “మహారాజా, యెందుకు మీరు నీళ్ళల్లో దూకరు? సేవకుల...

నాణాల సంచి

ఒక సారి ఒక చమురు వ్యాపారికి ఒక కసాయి వాడికి చాల పెద్ద గొడవ ఐపోయింది. విషయం తేలక ఇద్దరు బీర్బల్ దగ్గరకు వెళ్ళారు.తగువు తీర్చమని బీర్బల్ ని అడిగారు.“అసలు గొడవ యేమిటి?” అని బీర్బల్ అడిగాడు .అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు, “నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి”వెంటనే ఆ చమురు వ్యాపారి, “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్ఖ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.న్యాయం చెప్పండి.” అన్నాడు. బీర్బల్ యెన్ని సార్లు అడిగినా వాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్ళి మళ్ళి అదే మాట చెప్ప సాగారు. ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని అలోచించాడు.ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది.ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు...

అసలు యజమాని ఎవరు?

ఒక సారి ఒక సామంతరాజు బీర్బల్ తెలివితేటల గురించి విని ఆయనని చూడాలని ఒక రైతు వేషం ధరించి గుర్రం మీది రాజధాని వైపు బయలుదేరాడు. దారిలో ఒక కుంటి వ్యక్తి రహదారులను సహాయమడుగుతూ కనిపించాడు. సామంతరాజు జాలి పడి ఆ వ్యక్తికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆగి ఆ కుంటి వ్యక్తిని పలకరించాడు. అతను రాజధాని వెళ్ళాలని చెప్పాడు. సామంతరాజు వెంటనే కుంటి వ్యక్తిని గుర్రం యెక్కించి తను నడవ సాగాడు. రాజధాని చేరాక ఆ కుంటి వాడు దిగడానకి ఇష్టపడలేదు. కేకలూ అరుపులూ మొదలపెట్టాడు. సామంతరాజు నిర్ఘాంతపోయి చూస్తుండగా చుట్టూర పది మంది చేరారు. కింటివాడు చేరిన జనానికి తనదే గుర్రమని, ఆ రైతు వేశం లో వున్న సామంతరాజును కేవలం అతని పనివాడని చెప్పాడు. సామంతరాజు, కాదు, గుర్రం అతనిదని, సహాయం చేస్తే ఇలా ఇరుక్కున్నట్టు చెప్పాడు. ఇద్దరు కలిసి అక్బర్ చక్రవర్తి దర్బారుకి న్యాయంకోసం వచ్చారు. అక్బర్ బీర్బల్ను న్యాయం చెప్ప మన్నాడు. బీర్బల్ గుర్రాన్ని గుర్రపుశాలలో కట్టేయమని ఆదేశించి, వీళ్ళిద్దరిని మరునడు మళ్ళి దర్బారుకి రమ్మన్నాడు. తెల్లవారింది. ఇద్దరు దర్బారులో హాజరయ్యారు. బీర్బల్ ఇద్దరిని గుర్రపుశాలక...

తోటలో మొక్కలు; అడవిలో చెట్లు

అక్బర్ బాద్ షా తన ఇష్టమైన మంత్రి బీర్బల్ తో షికారుకు ఒక నాడు బయలుదేరాడు. దారిలో ఒక ఆటవిక స్త్రీ చెట్టుకింద కూర్చుని ఆయాస పడడం చూసారు. కొంత సేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి, ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, తన దారిని చక చక బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. ఇది చూసిన అక్బర్ బాద్ షా బిడ్డను ప్రసవించడం అంత సునాయసమని అపోహ పడ్డారు. ఇంటికి వచ్చి, గర్భవతి ఐన తన బేగంకి పరిచారకులు అవసరంలేదని, తన పనులు తనే చేసుకోవాలని చెప్పి, వాళ్ళను వేరే పనులు చేసుకోమని మళ్ళించారు. నిండు గర్భవతి ఐన బేగం తన పనులు చేసుకోవటం అలవాటు లేక, చాలా ఇబ్బంది పడసాగింది. తట్టుకోలేక ఒక రోజు బీర్బల్ను సహాయం అర్థించింది. బీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ బాద్ షా తో యెలా చెప్పాలని సతమతమయ్యాడు. అలోచించగా ఒక ఉపాయం తట్టింది. కోట లోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి నీళ్ళు పోయవద్దని చెప్పాడు. రోజు తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒక రోజు అలాగే తోటలో వుండగా మొక్కలు నీరసించి వాడిపోతూ వుండడం గమనించాడు. వెంటనే తోట మాలిని విషయం చెప్పమని ఆగ్రహించాడు. తోట మ...

అత్తారింటికి దారేది?

ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా నిశబ్దంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది. యమున నది తీరంలో ఉన్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది ఎడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్ కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి , “ ఇదేమిటి , యమునా నది ఇంత గట్టిగా ఎడుస్తోంది ” అనుకున్నాడు. ఎంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు. మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి , “ మీలో ఎవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా ?” అని అడిగారు. సభికులు తెల్లబోయి , సమాధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు. బీర్బల్ ముందుకొచ్చి , “ మహారాజా , ఒక సారి వింటే కాని నేను చెప్పలేను ” అని అన్నాడు. అక్బర్ వెంటనే బీర్బల్ ని ఆ రాత్రి అంతఃపురంకి రమ్మని ఆహ్వానించాడు. రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమునా నది హోరును విన్నాడు. విషయం అర్ధమయ్యింది. మహారాజా , యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని , పుట్టింటిని వదిలి వె...

దొంగ ఎవరు?

అక్బర్ బాద్ షా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతని పనివాడు ఒక రోజు దొంగతనం చేసి , నగలు , రొక్కం తీసుకుని పారిపోయాడు.కొన్ని రోజులు అయ్యాక , ఒక సారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూసాడు. ఆ పనివాడు కూడ ధనవంతుడిని చూసాడు. ఎక్కడా పారిపోవడానికి దారిలేదని గ్రహించి , వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు. “ దుర్మార్గుడా! దొరికావు! ఇప్పుడెలా పారిపోతావు ? దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా ? నా నగలు , రొక్కం తిరిగి ఇవ్వు! ” అని అరవడం మొదలుపెట్టాడు. ధనవంతుడు నిర్ఘాంత పోయాడు. “ నేను దొంగతనం చేయడం యేమిటి , వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజ భటులకు పట్టిస్తాను! ” అని గొడవపడ సాగాడు. బజారులోని కొందరు పెద్దమనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరకి న్యాయం కోసం తీసుకు వెళ్ళారు. బీర్బల్ యెదురుకుండా ఇద్దరు వారి వారి కథలను మళ్ళి చెప్పారు.బీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి , “ ఇద్దరిని ఒక కిటికీ దగ్గిరకి తీసుకెళ్ళి అందులోంచి తలలను బయట పెట్టమను ” అన్నాడు.ఇద్దరు కిటికి బయట తలలు పెట్టాక , బీర్బల్ , “ ఇప్పుడు పనివాడి తల నరికేయి! ” అని ఆదేశించాడు. ఈ మాట వినంగానే అసలు పనివాడు ఖంగా...

బీర్బల్ జ్వరం

ఒక సారి బీర్బల్ కి బాగా జ్వరమొచ్చి కొన్ని రోజులు రాజసభకు వెళ్ళలేదు. అక్బర్ కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆత్రుతతో బీర్బల్ ని చూడడానికి అతని ఇంటికి వెళ్ళారు. బీర్బల్ జ్వరం వల్ల నీరచించి , చిక్కి శైల్యం అయ్యి ఉన్నాడు.