Skip to main content

Posts

Showing posts with the label రాజు

తిక్కరాజు-వెర్రిమంత్రి

అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం, మంచివాళ్ళే- కానీ రాజుకీ, మంత్రికీ మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరు రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించటం అంటే అస్సలు ఇష్టంలేదు. అందుకని, ఏదైనా ప్రత్యేకత ఉండాలని, వాళ్ళొక శాసనం చేసారు- పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు: "రాజ్యంలో ప్రతివాళ్ళూ చీకట్లో పని చెయ్యాలి; తెల్లవారాక పడుకోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో, వాళ్లకు మరణ దండన!" ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలౌతున్నందుకు రాజుగారు, మంత్రిగారు మాత్రం చాలా సంతోషపడ్డారు. ఒకరోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు, మహిమాన్వితుడైన ఒక గురువు. మధ్యాహ్నం అవుతున్నది; నగరం చాలా అందంగా ఉన్నది. కానీ అటూ ఇటూ తిరుగుతూ మనుషులు కాదుగదా, ఒక్క ఎలుకకూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారాయె! రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు! గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అయితే సాయంత్రం అయ్యేసరికి, నగరమంతా ఒక్కసారిగా మేల్కొన్...

మోసం

సింహపురి రాజ్యాన్ని కనక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలందరూ సరిగ్గా పన్నులు చెల్లించేవాళ్ళు. దాంతో ఆయన కోశాగారం ఎల్లప్పుడూ ధనంతో నిండి ఉండేది. ఆ కోశాగారానికి సంరక్షకుడు సుబ్బన్న, ముసలివాడవుతున్నాడు. తన తరువాత కోశాగారపు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలిగే యువకుడిని ఎంపిక చేయమని సుబ్బన్న రాజుగారికి మనవి చేసుకొన్నాడు. రాజుగారు కొంచెం ఆలోచనలో పడ్డారు. సుబ్బన్న సమర్థుడూ, విశ్వాసపాత్రుడున్నూ. తన తండ్రిగారి హయాం నుంచీ కోశాగార బాధ్యతలు నిర్వహిస్తున్న సుబ్బన్న బలంగా ఉన్నంత కాలమూ తనకు కోశాగారం గురించి ఆలోచించవలసిన పని పడలేదు. ఇప్పుడిక కొత్త వారిని వెతకటం తప్పని సరి. అందుకని రాజుగారు చాటింపు వేయించారు:"రాజుగారికి ఆంతరంగికుడు ఒకడు కావాలి. చదువూ, బలమూ, తెలివి తేటలూ, నిజాయితీ, దురలవాట్లు లేకుండా ఉండటం- ఇవీ అవసరాలు". ఇంకేముంది, రాజ్యంలోని యువకులు అందరూ పోటీపడ్డారు. ఆ పోటీలు అన్నింటిలోనూ ఉత్తములుగా ఎంపికైన నలుగురిని రాజుగారి సమక్షంలో నిలబెట్టారు రాజోద్యోగులు. మహారాజుగారు వారి దేహ దారుఢ్యాన్నీ, చదువునీ, తెలివితేటల్నీ పరిశీలించారు. అన్నింటిలోనూ ఎవరి...

విశాల హృదయం-విశాల రాజ్యం

-------------------------------- అనగా అనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు విశాల రాజ్యం. ఆరాజ్యానికి రాజు విశాలుడు. పేరుకు తగ్గట్లుగా ఆ రాజు హృదయం విశాలమైనది. రాజు రాజ్యాన్ని బాగా పరిపాలించేవాడు. ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకు తగిన విధంగానే ప్రజలు కూడా ఆయన పట్ల వినయ విధేతలు కలిగి ఉండేవాళ్లు. కష్టపడి పని చేసేవాళ్ళు. రైతులందరితో పాటు రాజు కూడా వ్యవసాయం చేసేవాడు. మంచి మంచి పంటలు పండించేవాడు. రైతులందరికి పంటలు పండించడంలో మెళుకువలు చెప్పి, మం చి నాణ్యమైన పంటలు పండించేట్లు చూసేవాడు విశాలుడు. తను రాజునన్న గర్వం ఏనాడూ ఉండేది కాదు ఆయనకు. ఇతర రాజ్యాలలో వున్న వ్యాపారస్తులంతా నాణ్యమైన సరుకు కోసం విశాల రాజ్యానికి వచ్చేవారు. అందువల్లకూడా, విశాలరాజ్యంలోని రైతులకు మంచి లాభాలు వచ్చేవి. ఆ ఉత్సాహంతో రైతులు ఇంకా నాణ్యమైన పంటలను పండించేవారు. ఆ విధంగా ఆ రాజ్యం నాణ్యమైన సరకులకు పెట్టిన పేరైంది. కొన్నిసంవత్సరాల తరువాత ఆ రాజు ఆ రాజ్యంలోని రైతులందరినీ సమావేశపరిచి, "నేను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. రాజ్యం వదలి అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను. ఈ రోజు సుదినం....