Skip to main content

Posts

Showing posts with the label వ్యాపారం

పట్టిందల్లా బంగారం

అనగా అనగా ఒక ఊళ్లో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. బంగారు వ్యాపారం చేసేవాడు; ఎంతో కూడ బెట్టాడు-కానీ అతనికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది. భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది. ఆయనకు తన కూతురు అంటే కూడా చాలా ఇష్టం. ఒక రోజున, భూపతి దేవుణ్ని ప్రార్థిస్తూ ఉండగా, అకస్మాత్తుగా ఆ దేవుడే ప్రత్యక్షమయ్యాడు: "భూపతీ! నీ భక్తి నాకు నచ్చింది. నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది. ఏం వరంకావాలో కోరుకో" అన్నాడు దేవుడు. భూపతి సంతోషంతో పులకించి పోయాడు. "ఏం వరం అడిగినాఇస్తారు కదా స్వామీ!" అని అడిగాడు, ముందస్తుగా. "వరాన్ని బట్టి ఉంటుంది. కోరుకో, ముందు" అన్నాడు దేవుడు. "నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా"అని కోరుకున్నాడు భూపతి. "సరే, నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను మరి- జాగ్రత్తగా ఉపయోగించుకో " అని చెప్పి దేవుడు మాయమయిపోయాడు. భూపతికి చాలా సంతోషం వేసింది. 'ప్రయత్నించి చూద్దాం' అని చెప్పి ఒక గాజు బొమ్మను ముట్టుకున్నాడు- తక్షణం ఆ గాజుబొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది! మంచాలనీ, కుర్చీలనీ ముట్టుకున్నాడు. అవికూడా వెంటనే ...