నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది. అందువలన యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు. కాని ఒకనోకనాడు కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొన్నాడు.మనకు ప్రధాన వనరు గోవర్ధనం కనుక నాకు గోవుల్ని,బ్రాహ్మణులని,గోవర్ధనం ను అరాధి౦చుదామ్, ఇంద్ర యజ్ఞం నాకు సమ్మతం కాదు అని సర్వులకు నచ్చచెప్పి ఇంద్ర యజ్ఞ నిర్వహణ నిలుపుదల చేస్తాడు. దీనితో యాదవులందరు గోవర్ధన ప్రదక్షిణతో అచలవ్రతం చేయనారంభిస్తారు. ఈ విషయం గమనించిన ఇంద్రుడు మహోగ్రంతో యాదవులను శిక్షించ పూనుకుంటాడు. ప్రళయకాల గర్జన్లతో విద్యుత్ సమాన మెరుపులతో కారు మబ్బులతో ధారపాతమైన వర్షం ను గోకులం పైన ఎడ తెరిపి లేకుండా కురిపిస్తాడు. కొద్ది సేపటికే ప్రజలు అక్కడ జీవనం సాగించలేని పరిస్థితి నెల కొన్నది. ద...