Skip to main content

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది.
ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి
గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక
అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది.
చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి.
ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని
నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో
కాకిముక్కుకు అంద లేదు.

కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు.
చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని
వచ్చి ఆ కుండ లో పడేసింది.
కుండ లోకి
రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి.
కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా
యెగిరిపోయింది.
నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది.
.
.
.
“పాత కాలం కాకి కనుక
కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే
ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

Comments

  1. ఈ రోజుల లో అయితే ??????☺ Kaki ame

    ReplyDelete
  2. కి దాహం ఎలా తీరుతుంది,

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఆవు - పులి

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసిం