Skip to main content

గోవర్ధనగిరి - కృష్ణ లీలా విశేషం

నందగోకులము లోని
యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి.
ఈ పర్వతం పై వున్న
పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి.
ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.
అందువలన యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి
సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు.
కాని ఒకనోకనాడు కృష్ణుడు ఈ యాగ
నిర్వాహణను అడ్డుకొన్నాడు.మనకు ప్రధాన వనరు గోవర్ధనం కనుక నాకు గోవుల్ని,బ్రాహ్మణులని,గోవర్ధనం ను అరాధి౦చుదామ్, ఇంద్ర
యజ్ఞం నాకు సమ్మతం కాదు అని
సర్వులకు నచ్చచెప్పి ఇంద్ర యజ్ఞ నిర్వహణ నిలుపుదల చేస్తాడు.
దీనితో యాదవులందరు గోవర్ధన ప్రదక్షిణతో అచలవ్రతం చేయనారంభిస్తారు.
ఈ విషయం గమనించిన ఇంద్రుడు మహోగ్రంతో యాదవులను శిక్షించ పూనుకుంటాడు.
ప్రళయకాల గర్జన్లతో విద్యుత్ సమాన మెరుపులతో కారు మబ్బులతో ధారపాతమైన వర్షం ను గోకులం పైన ఎడ తెరిపి లేకుండా కురిపిస్తాడు.

కొద్ది సేపటికే ప్రజలు అక్కడ
జీవనం సాగించలేని పరిస్థితి నెల కొన్నది.
దీనితో యాదవులందరు శ్రీకృష్ణుని శరణాగతి కోరటం తో
స్వామీ గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి సర్వప్రజలకు,గోవులకు రక్షణ కల్పిస్తాడు.
ఈ విధంగా 7 రాత్రులు 7 పగళ్ళు నిరంతర వర్షం కురుస్తున్న తనను శరణాగతి కోరిన వారికి
రక్షణ కల్పిస్తాడు.
తన ఆశ్రయం లో వున్న వారికి తాము ఇన్ని రోజులు వున్నాం అనే భావన రాకు౦డా యోగమాయ ద్వార వారు ఆనందసాగరం లో వుండే
విధంగా అనుగ్రహిస్తాడు.
ఈ విధంగా ఇంద్రునిగర్వభంగం చేస్తాడు.
ప్రజలందరు గోవులను కాపాడిన వాడు కాబట్టి గోవిందుడు అని పొగడుతు తమ నివాసాలకు తిరిగి చేరుతారు.
.
.
స్థూలంగా భాగవతంలో ఈ ఘట్టంలోని కధ ఇది.
మరి మనం కధగా చదువుకొ౦దామా లేక స్వామీ లీల
యొక్క విశేషం గ్రహి౦చుదామా?
ఈ విశేషం పై పండిత అంతరార్ధం వేరుగా వున్నది, స్వామీ వారి అనుగ్రహం పై కలిగిన భావనను ఇక్కడ
తెలుపుచున్నాను.
గోవర్ధనం అనేది ఒక అచల
పర్వతం.గోవులకు అవసరమైన ఆహరం సమృద్ధిగా లభించు ప్రదేశం. అలాగే కొ౦డ అంటేనే సకల జీవజాలంనకు ఆవాలం.
గోవును కామధేను ప్రతి
రూపముగా కొలుస్తాము.కామధేనువు సర్వదేవ ఆవాసం గా కొలుస్తాము.అలాగే గోవు ఆనాటి ప్రజల సిరిస౦పదలకు మూలం. ఎన్ని గోవులు వుంటే
అంత సంపద.
పురుషుడి వలన వంశం,గోవుల
వలన పాడి సమృద్ధిగా పెరుగుతాయని ఆర్యుల నమ్మకం.అదే పౌరాణిక గాధలో నిక్షిప్తం.
అలాగే ఇంద్రుడు అష్టదిక్పాలకులకు అధిపతి.రాజుతో సమానం. సర్వులు ఆయనకు లోబడి వుండాలి. కాని
విశ్వ సంరక్షకుడు విష్ణువు ఈనాడు శ్రీకృష్ణ అవతారంలో నందగోకులం లో వుండి శిష్ట రక్షణ చేస్తున్నాడు.
అ౦దువలన సర్వ ప్రజలు పరమాత్మను కొనియాడుతున్నారు.కాని
కృష్ణుడు ఈ సమయములో ఇంద్రునికి పూజని అడ్డుకోవటము వలన ఇ౦ద్రునిలొ ఈర్ష్యతో రగలి
ప్రకృతి నియమ విరుద్ధముగా వర్షము,తన పాలిత ప్రజలపై తానే దాడికి పూనుకొన్నాడు.
దీని వలన ప్రాణకోటికి ఇబ్బంది.కాని ఆసమయములో కృష్ణుడు గోవర్ధనమును తన చిటికిన వ్రేలి పై
నిలిపి ప్రాణకోటిని,ప్రకృతిని రక్షించాడు.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.