Skip to main content

మహాశివుడు కిరాతకుడిగా ఎందుకు మారాడు?

''దేవేంద్రుని దగ్గర దివ్య వస్త్రాలు తీసుకో''మని ధర్మరాజు చెప్పడంతో
అర్జునుడు ఇంద్రసభకు బయల్దేరాడు. అయితే, అందుకోసం ముందుగా పరమశివుని ప్రసన్నం చేసుకోమని చెప్పాడు ఇంద్రుడు.
అర్జునుడు మహాశివునికోసం ధ్యానం చేశాడు. కానీ, శివుడు వెంటనే అర్జునుని
కరుణించదలచలేదు. ఒక పరీక్ష పెట్టాడు. శివుడు పెట్టిన పరీక్ష ఏమిటంటే -
అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న ప్రదేశానికి మూకాసురుని సూకర
రూపంలో పంపించాడు. మహాశివుని ఆజ్ఞ మేరకు మూకాసురుడు పంది రూపంలో
అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలో తిరగసాగాడు.
మహాశివుడు కిరాతకుడిగా (వేటగాడిగా) మారాడు. ఆ మారడంలో శివుడి అలంకారాలన్నీ రూపు మారాయి. త్రిశూలం విల్లంబుగా, నెలవంక నెమలి ఈకగా, రుద్రాక్షమాల పూసల
దండగా మారాయి. ఇక పార్వతీదేవి కిరాతకుని భార్యగా అవతరించింది.
శబ్దం చేస్తూ అటూఇటూ తిరిగుతున్న పంది తపోభంగం గావించడంతో అర్జునుడు విసిగిపోయి, బాణం వేశాడు.
ఆ పందినే వేటాడుతూ వచ్చినట్లు కిరాతకుడు కూడా
పందికి బాణాలు వేశాడు. అటు అర్జునుడు, ఇటు కిరాతకుడు వేసిన బాణాలు తగిలి
సూకరం కాస్తా ప్రాణాలు కోల్పోయింది.

ఇక ఆ పందిని నేను చంపాను అంటే
నేను చంపాను అంటూ అర్జునుడు, కిరాతకుడు - ఇద్దరూ వాదులాటకు దిగారు. ఆ గొడవ ఘర్షణగా, యుద్ధంగా పరిణమించింది.
ఇద్దరికిద్దరూ బాణాలు సుకున్నారు.
అర్జునుడు తాను విలువిద్యలో సాటిలేని మేటినని, తన బాణమే వధించిందన్నాడు. మా వృత్తే జంతువులను వేటాడటం.. నా బాణానికే ప్రాణాలు కోల్పోయిందని కిరాతకుడు..
కోపంతో రగిలిపోయిన అర్జునుడు శర పరంపర కురిపించాడు. కానీ ఆ
బాణాలన్నీ వ్యర్ధం అయ్యాయి. ఒక్కటీకిరాతకుని రూపంలో ఉన్న శివుని
చేరలేదు. శివుడు వేసిన ఒకే ఒక్కబాణంతో అర్జునుడు కింద
పడిపోయాడు.
రగిలిపోతోన్న హృదయంతోఅర్జునుడు పట్టుదలగా
విల్లు సంధించాడు. దాంతోముల్లోకాలూ కంపించాయి.
అప్పటికి గానీ అర్జునునికిజ్ఞానోదయం కాలేదు. తన ఎదురుగా
ఉన్నది కిరాత దంపతులు కాదని, ఆ రూపంలో పార్వతీ పరమేస్వరులే నని
గ్రహించాడు.
వెంటనే పశ్చాత్తాపంతో కాళ్ళమీద పడి క్షమించమని
ప్రార్ధించాడు.
మహాశివుడు చిరునవ్వు నవ్విఅర్జునుని ఆశీర్వదించాడు.
పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.