Skip to main content

తోటలో మొక్కలు; అడవిలో చెట్లు

అక్బర్ బాద్ షా తన ఇష్టమైన మంత్రి బీర్బల్ తో
షికారుకు ఒక నాడు బయలుదేరాడు. దారిలో ఒక
ఆటవిక స్త్రీ చెట్టుకింద కూర్చుని ఆయాస
పడడం చూసారు.
కొంత సేపటికి తిరిగి కోట వైపు వెళ్తుంటే ఆ స్త్రీ ఒక
బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని గుడ్డల్లో చుట్టి,
ప్రసవమైన ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి, తన దారిని చక
చక బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది.
ఇది చూసిన అక్బర్ బాద్ షా
బిడ్డను ప్రసవించడం అంత సునాయసమని అపోహ
పడ్డారు.
ఇంటికి వచ్చి, గర్భవతి ఐన తన బేగంకి
పరిచారకులు అవసరంలేదని, తన పనులు తనే
చేసుకోవాలని చెప్పి, వాళ్ళను వేరే
పనులు చేసుకోమని మళ్ళించారు.
నిండు గర్భవతి ఐన బేగం తన
పనులు చేసుకోవటం అలవాటు లేక, చాలా ఇబ్బంది
పడసాగింది.
తట్టుకోలేక ఒక
రోజు బీర్బల్ను సహాయం అర్థించింది.
బీర్బల్ ఇంత నాజూకైన విషయం అక్బర్ బాద్ షా తో
యెలా చెప్పాలని సతమతమయ్యాడు.


అలోచించగా ఒక ఉపాయం తట్టింది.
కోట లోని తోటమాలిని కొద్ది రోజులు మొక్కలకి
నీళ్ళు పోయవద్దని చెప్పాడు.
రోజు తోటలో విహరించడం అలవాటైన అక్బర్ ఒక
రోజు అలాగే తోటలో వుండగా మొక్కలు నీరసించి
వాడిపోతూ వుండడం గమనించాడు.
వెంటనే తోట
మాలిని విషయం చెప్పమని ఆగ్రహించాడు.
తోట మాలి బీర్బల్
ఆదేశాననుసారం మొక్కలకు నీళ్ళు పోయటంలేదని
చెప్పాడు.
క్రొధంతో అక్బర్ బీర్బల్ను పిలిపించాడు.g
“మొక్కలు నీళ్ళు లేకపోతే యెండిపోవ?” అని కోపంతో
కేకలు వేయ సాగాడు.
బీర్బల్ అప్పుడు నిదానంగా, “బాద్ షా! అడవిలో పెద్ద
పెద్ద వృక్షాలు యే తోట మాలి సహాయం లేకుండా,
రోజు నీళ్ళు పోయకుండ, పెరిగాయికద? అలాగే మరి
మన కోట లో తోటలకి ఇంత మంది
సేవకులు యెందుకు?” అన్నాడు.
వెంటనే అక్బర్కు ఙ్యానోదయమయ్యింది. బీర్బల్
సున్నితంగా ఇచ్చిన సూచనను గ్రహించి వెంటనే
రాణి గారికి పరిచారకులను పురమాయించాడు.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.