Skip to main content

రత్నహారపు సమస్య

ఒక రాజుకు కలలో దేవుడు ప్రత్యక్షమై ఒక
రత్నాన్ని బహూకరించాడు.
దానికి రెండు వైపులా రంధ్రాలు ఉన్నాయి. దాన్ని
హారంలో వేసుకొని ధరించాలనిపించింది రాజుకు.
ఆస్థాన కంసాలిని పిలిచి "మంచి హారంలోకి
ఎక్కించండి దీన్ని" అని ఆదేశించాడు.
మరుదినం కంసాలి వచ్చి "మహారాజా! ఎంత
ప్రయత్నించినా బంగారు తీగ రత్నం గుండా
దూరటం లేదు. రత్నానికి రంధ్రం సరిగా
ఉన్నట్లు లేదు- మధ్యలోనే అడ్డుకుంటున్నది.
పోనీ, 'దారాన్ని ఇంకొంచెం సన్నం చేద్దామా' అంటే,
అది ఇప్పటికే చాలా సన్నం అయిపోయిందాయె!"
అన్నాడు.

దాంతో రాజు దేశ దేశాల
స్వర్ణకారులను పిలిపించాడు. అయినా
ఫలితం లేదు- ఆ రత్నంలోంచి దూరేంత సన్నటి
దారాన్ని ఎవ్వరూ చెయ్యలేకపోయారు.
అదే దేశంలోని తెలివైన యువకుడు ఒకడు ఒకసారి
రాజువద్దకు వచ్చి, "నేను ప్రయత్నించి
చూస్తాను" అన్నాడు. "చూద్దువు గాని, అయినా
ఇంతమంది దగ్గర లేనిది, నీ దగ్గర ఉన్నది ఏమిటి? అన్నాడు రాజు.
"తెలివి, పట్టుదల- ఈ రెండూ ఉన్నై నాలో. అయినా
ప్రయత్నిస్తే తప్పేముంది?"
అన్నాడు యువకుడు. రాజు సంతోషించాడు.
కంసాలి తయారుచేసిన బంగారుతీగనే తీసుకున్న
యువకుడు, ముందు ఒకరోజంతా ఆ రత్నంతో
కుస్తీపట్టాడు- అయినా ఏమీ లాభం లేదు-
రత్నపు రంధ్రంలోకి నిజంగానే
దూరటంలేదు దారం.
కొంత సేపటికి అతనికి ఓ ఆలోచన వచ్చింది. "ప్రభూ! ఒక రోజు సమయం దయ చేయించండి" అని అడిగాడు. రాజుగారు సరేనన్నారు.
మరునాడు తెల్లవారే సరికల్లా రత్న హారాన్ని
తీసుకువచ్చి రాజుకి అందజేశాడు యువకుడు!
హారంలో రత్నం చక్కగా అమరి ఉన్నది!
"భళా! ఎందరో గొప్ప స్వర్ణకారుల వల్ల కాని పని
నీవల్ల అయింది. ఎట్లా చేశావు?" అని
అడిగాడు యువకుడిని
"మహారాజా! ఆ బంగారు తీగను తేనెలో ముంచి, రత్నపు బెజ్జంలో అది దూరినంత వరకు దూర్చి, గదిలో మూలగా- ఒక చీమల పుట్టకు ఎదురుగా- పెట్టాను.
కొంచెం సేపటికల్లా తేనె వాసన పట్టి,
చీమలు రత్నంలోకి రాసాగాయి. నేను రత్నాన్ని
కదలకుండా ఇరికించి పెట్టాను; అలాగే తీగ
రత్నంలోంచి జారిపోకుండా జాగ్రత్త పడ్డాను.
అంతే, తెల్లారే సరికి చీమలు తీగను బెజ్జంగుండా
రెండోవైపుకు లాక్కెళ్ళాయి! మరి అవి
రత్నపు బెజ్జాన్నే పెద్దగా చేశాయో, లేక తీగను సన్నగా చేశాయో మరి, తెలీదు.
ఇది నా గొప్పతనం కాదు. ఆ చిన్న చీమలు చేసిన ఘనకార్యం ఇది" అని జవాబిచ్చాడు.
అది విని సభలోని వారంతా హర్షధ్వానాలు చేశారు.
రాజు ఆ యువకుడిని ఘనంగా సత్కరించటంతో
పాటు, అతన్ని తన ఆంతరంగిక సలహాదారుగా
నియమించు-కున్నాడు.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.