Skip to main content

నోరు జారిన మాటలు

చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడేఒక అమ్మాయి వుండేది.
ఆ అమ్మాయి రోజంతా గాలికబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడమాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటేచూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది.
ఇలా గాలికబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినాచారుమతి మట్టుకు పట్టించుకునేది కాదు

.ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒకసాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మతన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికితన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆసాధువును కోరుకుంది.
ఆసాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికితీసుకు రమ్మని చెప్పాడు.
మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆసాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆసాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆకోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమనిచెప్పాడు.
“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడిఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది.చారుమతి సంతోషంగా ఊరంతాతిరుగుతూ కనిపించిన వారందరికికబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈకవిసిరేసింది.
సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటేఅమ్మ, చారుమతి మళ్ళీ ఆసధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళితెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు
సధువు.మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతావిసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అనిచారుమతితో అన్నాడు.వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది
.సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్కఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతిసూర్యోస్తమమయ్యె సమయానికి ఆసధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి,నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడదొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.
అప్పడు సాధువు తనకు, “చూశావా, మనమాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మననోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగితీసుకోలేము.” అని చెప్పాడు.
ఆ రోజు నుంచి చారుమతి గాలికబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని,ఇబ్బందిపెట్టడం మానేసింది.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.