Skip to main content

బిక్షాపాత్ర కధ

రాజుగారు ఉద్యానవనం నుంచి తిరిగి రాజప్రాసాదంలో
అడుగిడే ముందు...
అతని కి వున్నట్టుండి ఒకడు ఎదురుపడ్డాడు.
చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు.
బాగా ఉల్లాసంగా వున్న రాజుగారికి అతగాడికి ఎదైనా
సాయం చేయాలని అనిపించింది.
‘ఏం కావాలి నీకు ?కోరుకో!ఏదయినా సరే ఇస్తాను’
అన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ.
‘రాజా! తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి
రెండు సార్లు ఆలోచించుకో’ అలా ధైర్యంగా నిలదీసే
మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు.
రాజు అన్నాడు అతడితో.‘పరవాలేదు అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట
తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.’

‘సరే! రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో
ఏం వేస్తారో వేయండి. దీన్ని నింపండి. నాకంతే చాలు.
అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి
ఆలోచించుకోండి’ రాజు విలాసంగా నవ్వాడు. నవ్వి
అన్నాడు.
‘ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన
అవసరం వుందనుకోను’ రాజు అతడిని
వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు.
పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ
పాత్రను నింపమని ఆదేశించాడు.
కృష్ణ తులాభారం మాదిరిగా సన్నివేశం మారిపోయింది.
ఒకటికి రెండుసార్లు యెందుకు ఆలోచించుకోమన్నాడో
రాజుకు క్రమంగా అవగతమవుతోంది.
ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టే
అదృశ్యం అయిపోతున్నాయి. ఆ బిక్షాపాత్ర తిరిగి ఖాళీ
అవుతూనే వుంది.
రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి
జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
ఖజానాలోని సమస్త ధనరాసులు,
స్వర్ణాభరణాలను భటులు గంపలకొద్దీ తెచ్చి ఆ
బిక్షాపాత్రలో వేస్తున్నారు.
చిత్రం! వేసినవి వేసినట్టే మాయం అవుతున్నాయి. పాత్ర
ఖాళీ అవుతూనే వుంది.
రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందూ వెనకా
చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు.
ఫలితం శూన్యం.
చివరకి జరిగినదేమిటంటే సాయంత్రానికల్లా రాజ దర్బారులో
ఇద్దరు బిక్షగాళ్ళు మిగిలారు.
ఒకడు ఆ వచ్చినవాడు. రెండోవాడు రాజుగారు.
సర్వం పోగొట్టుకున్న తరువాతగాని
రాజుకు గర్వం దిగిరాలేదు. ఆగంతకుడి
ముందు సాగిలపడి అన్నాడు.
‘మహానుభావా! నా అహంకారాన్ని మన్నించండి.
నేను మీమాట పెడచెవిన పెట్టాను.
ఇంతకీ ఈ బిక్షాపాత్ర సంగతి చెప్పండి. ఇందులోని
మర్మం ఏమిటో సెలవివ్వండి’
ఆగంతకుడు రాజును మించిన
విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేసాడు.
‘రాజా! నిజానికి ఇది బిక్షాపాత్ర కాదు. మానవ కపాలం.
నేను దాన్ని మెరుగు పెట్టి పాత్ర మాదిరిగా
కనబడేట్టు చేసాను. ఇందులో...ఎన్ని వేసినా,ఏం వేసినా
అంతే! ఏమీ మిగలదు. అధికారం,సిరి సంపదలు ఎన్ని
వున్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది.
దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా
వద్దనదు.యెంత ఇచ్చినా కాదనదు.మనుషులకు....
ఈ ఆశ నుండి....అత్యాశ నుండి.... కాటికి పోయినదాకా
అది వాళ్ల వెంటే వుంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే
ఇదంతా’ మాయమయిన ధనరాసులు, సిరి
సంపదలు రాజుకు మళ్ళీ దక్కాయి.
వాటితో పాటు అదనంగా... ఒక జీవిత సత్యం కూడా ఆయన
ఖాతాలో చేరింద.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.