Skip to main content

సందేహం

పూర్వం ఓ దేశంలో ఒక రాజుగారికో
సందేహం వచ్చింది.
వెంటనే తన మంత్రిని పిలిచి
"అమాత్యా! నా సందేహం ఏమిటంటే, "సృష్టికర్త అయిన ఈ దైవం చేసే ప్రధానమైనపని ఏమిటి?" అని.
రాజుగారికి వచ్చిన సందేహాన్ని తీర్చటానికి
మంత్రివర్యులు "రాజగురువు"ను పిలిపించి
రాజుగారి సందేహము తీర్చమని అడిగాడు.
రాజగురువు వెంటనే సమాధానము చెప్పక ఓ
వారము రోజులు గడువు తీసుకుని
బయటపడ్డాడు. కాని, ఆరురోజులయినా రాజుగారి
సందేహానికి సరైన సమాధానము స్పురించక,
ఆలోచిస్తూ, నగరము బయట అశాంతిగా
తిరుగుతున్నాడు.

అక్కడ రాజగురువును ఓ
ఆవులు కాచుకునే కుర్రవాడు చూచి " స్వామీ!
మీరు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు.
కారణం తెలుసుకోవచ్చా?" అని నమస్కారము చేసి మరీ అడిగాడు. ఆ కుర్రవాడు వినయము చూసి
ముగ్ధుడయి, ఆ రాజగురువు తన
సమస్యకు అతనివల్ల సమాధానము బహుశ:
భగవంతుడు పంపించి వుంటాడని తలంచి, తన
సమస్యని వివరించాడు.
అప్పుడాకుర్రవాడు "
స్వామీ! ఈ ప్రశ్నకు సమాధానము నాకు బాగా
తెలుసు. రాజుగారిని నన్ను రాజసభకు పిలిపించే
ఏర్పాటు చూడండి" అని చెప్పాడు.
రాజగురువు ఆ కుర్రవానియందు విశ్వాసముతో
రాజుగారిని దర్శించి, "రాజా! మీ
ప్రశ్నకు సమాధానము ఆ ఆవులు కాచే
కుర్రవాడు చెపుతాడు. మీరు అతనిని
సభకు అహ్వానించండి" అని తెలిపాడు.
రాజు భటులని పంపి ఆ కుర్రవానిని
రాజసభకు అహ్వానించాడు.
రాజసభలో ఆ కుర్రవాడు "
రాజా! మీ ప్రశ్నకు సమాధానము నేను చెపుతాను.
కాని అడిగేవారు మీరు కాబట్టి, మీరు శిష్యుని
స్థానంలో వున్నారు. చెప్పేవాడిని నేను కాబట్టి నాది గురుస్థానము. గురువు అగ్రస్థానములో
కుర్చోవాలి కదా!" అన్నాడు.
రాజు అతని మాటలు గ్రహించి, తన
ప్రశ్నకు సమాధానము తెలుసుకోగోరి, తన
సింహాసనము మీద అతని అధిష్టింప చేశాడు.
రాజసింహాసనము మీద అధిష్టించి ఆ
కుర్రవాడు ఇలా చెప్పాడు.
"రాజా! దైవము చేసే ప్రధానమైన పని ఇదే!
అహంకారులను క్రింద కూర్చోపెట్టడము,
అణకువతో ఉండేవారిని ఉన్నతస్థానములకు
చేర్చటము." అని చెప్పి తనదారిని తాను వెళ్ళిపోయాడు

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.