Skip to main content

ఆమ్మాయి కలలు

అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి వుండేది. ఆ
అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో
అమ్మడానికి వెళ్ళేది.
వచ్చిన డబ్బులతో
రోజులు గడుపుకునేది.
ఒక రోజు ఆవు మామూలుగా కన్నా
కొంచం యెక్కువ పాలు ఇచ్చింది. అది చూసి
అమ్మాయి చాల సంతోషించింది.
రోజు తీసుకువెళ్ళే
బిందె కన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని
తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుద్యారింది.
దారిలో సంతోశంగా నడుచుకుంటూ యెన్నో
ఊహలు అల్లటం మొదలెట్టింది.
“ఈ రోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలు ఇస్తే
నాకు రోజు యెక్కువ ఆదాయం వస్తుంది.
ఆ వచ్చిన
అధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక
మూటలో దాచేస్తాను.

కొద్ది రోజులకి ఆ మూటలో చాలా
డబ్బులు జమవుతాయి. అప్పుడు ఇంకో ఆవుని
కొంటాను. అలా, అలా కొద్ది రోజులలో నా దెగ్గిర చాలా
ఆవులు వుంటాయి.
అవి చూసుకోటాని పాలేరాళ్ళను పెడతాను.
నేను రోజూ ఇలా యెండలో ఊరికి వెళ్ళే
అవసరం వుండదు. అప్పుడు నేను కూడ
తెల్లగా అయిపోతాను.
వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త
పట్టు చీరలో నేను చాల అందంగా కనిపిస్తాను.
చీరకు తగ్గట్టు సంతలో గాజులు,
గొలుసు కూడ కొనుక్కుంటాను.
ఊరిలో యెవరింట్లోనైనా పెళ్ళి ఐతే, ఆ పెళ్ళికి చక్కగా
తలస్నానం చేసి, కొత్త పట్టు చీర కట్టుకుని,
నగలు పెట్టుకుని, జడలో పూలు పెట్టుకుని
వెళ్తాను.
అక్కడ నేను ధగ ధగా మెరిసిపోతూ చాలా అందంగా
కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు.
కాని నాకు నచ్చిన సంబంధం వచ్చే దాక నేను యేది
ఒప్పుకోను”
నచ్చని
సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ
అమ్మయి గట్టిగా తల అడ్డంగా ఊపింది.
తల మీద రోజు మోసేదానికన్నా యెక్కువ బరువు వుందన్న
విషయం మరిచిపోయింది.
ఢడేలుమని బిందె తలనించి పడిg
ముక్కలయిపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి.
ఆ పాలూ అమ్మలేదూ, యెక్కువ
డబ్బులూ సంపాదించలేదు,
ఆవులూ కొనలేదూ, పాలెరాళ్ళనీ పెట్టుకోలేదు,
పట్టు చీరా కొనలేదు, గాజులూ కొనలేదు –
ఊహించినవన్ని ఊహలలోనే వుండి పోయాయి.
పగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా
చేస్తే బాగుండేదని బాధ పడుతూ ఆ అమ్మాయి తిరిగి
ఇంటివైపుకు వెళ్ళి పోయింది

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.