Skip to main content

అత్యాశ

ఒకానొక పట్టణము లో ఒక
బిక్షగాడు ఉండేవాడు. వాడికి చాలా కొద్ది
మొత్తములో సాగు భూమి ఉన్నది.
దాని మీద ఏమీ ఆదాయం లేక యాచన చేసుకుంటూ, ఆ వచ్చిన దానిని తిని
బతుకుతుండేవాడు.
వాడికి ఒక రోజూ ఒక ఇంటిలో మంచి
ఆహారం దొరికినది. వాడు ఆహారాన్ని ఆ
ఇంటివద్దే కడుపునిండా భుజించాడు.
కడుపు నిండడం తో ఆ రోజుకి యాచన
చలించి ఇంటి దారి పట్టాడు. దారిలో ఒక
గృహస్థుడు వానికి కొద్దిగా పేలపిండి
ఇచ్చినాడు.

వానికి ఆకలి తీరి ఉండటం తో
దానిని భుజింపక తనతో తీసుకుని
ఇంటిదారి పట్టాడు. దారిలో ఒక చెట్టు నీడలో
విశ్రమింపదలచి, తన చెంత ఉన్న ఒక
గుడ్డను చెట్టు కింద పరచి, తన
మేను వాల్చి, తనలో తాను ఈ విధంగా
ఊహించుకోసాగాడు
"ఇపుడు నా కడుపు నిండినది కనుక ఈ
పేలపిండిని సంతలో అమ్మి ఆ వచ్చిన కొద్ది
మొత్తము తో కొద్దిగా నువ్వులు కొని నా
భూమిలో చల్లుతాను.
కొంతకాలము తరువాత అవి మంచి
కాపుకు వస్తాయి. వాటిని అమ్మి ఆ వచ్చిన
మొత్తము తో వడ్డీ వ్యాపారము చేసి
బాగుగా సంపాదిస్తాను.
అప్పటికి నాకు వివాహ వయసు కూడా వస్తుంది.
బాగా డబ్బు సంపాదిస్తాను కనుక
నాకు పిల్లను ఇవ్వడానికి
అందరూ ఆసక్తి చూపిస్తారు.
అందునుండి ఒక మంచి అమ్మాయిని
ఎన్నుకుని వివాహం చేసుకుంటాను.
ఎపుడైనా నా భార్య నా మాట విననిచో
నేను ఊరుకోను, నా కాలితో గట్టిగా ఇలా
తన్నుతాను" అని అసంకల్పితంగా తన కాలితో పేల పిండిని తన్నాడు.
అది కాస్త కింద పడి గాలికి మొత్తం ఎగిరిపోయింది. ఏదో జరుగుతుంది అని ఏదో ఏదో
ఊహించుకుంటూ వాడి అత్యాశకు వాడే
బలి అయ్యాడు.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.