Skip to main content

రొట్టె ముక్క

ఒక అడవిలో రెండు పిల్లులుండేవి.అవి
రెండూ స్నేహితులు.
ఒక రోజు రెంటికీ ఓ చోట రొట్టె
కనిపించింది. దాన్ని ఆ రెండూ ఎలా పంచుకోవాలా అని ఆలోచించాయి.
తనకు పెద్ద ముక్క కావాలంటే
తనకు కావాలని దెబ్బలాడుకోసాగాయి. ఇంతలో అటుగా వెళుతున్న కోతి ఒకటి వాటికి కనిపించింది. దాన్ని పిలిచి
జరిగిన విషయాన్ని చెప్పాయి.
అప్పుడు ఆ కోతి ఓస్
ఇంతేనా మీకెందుకు నాకు విడిచిపెట్టండి అని చెప్పి
రొట్టెను తన చేతుల్లొకి తీసుకుంది కోతి.
ఎక్కడి నుంచో ఒక త్రాసు తెచ్చింది.రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో
రెండు వైపులా పెట్టింది.
త్రాసు కుదివైపు మొగ్గటంతో 'ఈ ముక్క
పెద్దదైనట్టుందే' అని కుడివైపునున్న
ముక్కను కాస్త తినేసింది.

ఈ సారి ఎడమవైపు ఉన్న
ముక్కవైపు చూసి ఇప్పుడు ఇది పెద్దదైపోయింది
అని దానిలో కూడా కొంత బాగం తినేసింది.
ఇలా ఒక్కో
ముక్కా కొంచెం కొంచెం తినేస్తూనే వాటికి
రొట్తెను పంచుతున్నట్టు నాటకమాడింది.
కోతి తినేస్తుంటే బాధగా ఉన్నా తమకు సమానమైన
ముక్కలు వస్తాయని పిల్లులు మాత్రం ఆశగా
చూడసాగాయి.
చివరికి కోతి రొట్టె మొత్తం తినేసి ఎంచక్కా
తన దారిన తాను వెళ్ళి పోయింది.
అప్పటికి గాని పిల్లులకు తాము చేసిన తప్పు అర్ధం కాలేదు.
స్నెహితులమై ఉండి కూడా చిన్న రొట్టె ముక్క
కోసం తగవులాడుకున్నాం.
ఎలాగోలా పంచెసుకుని
ఉంటే అది మన మద్యనే ఉండేది. ఇద్దరమూ తినక
మొత్తం రొట్తెను కోతిని పిలిచి మరీ ఇచాము అని
తమను తామే నిదించుకుని బాదపడ్డాయి.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.