Skip to main content

వితరణశీలి విక్రమార్కుడు

ఒకరోజు అవంతీరాజు ఒకభట్రాజు పద్యాల ద్వారా
విక్రమాదిత్యుని గుణగణాలను విన్నాడు. ఇంత
నీతిమంతుడు సత్యనిష్ఠుడు గుణాగ్రగణ్యుడు లోకంలో
ఉంటాడా? అని అశ్చర్యమేసింది ఆయనకు.
విక్రమార్కుని మీద కించిత్ అసూయపడి
“నాకు విక్రమార్కుడంత కీర్తిప్రఖ్యాతు
లు ఎలావస్తాయి?” అని విచారించసాగినాడు. అదే
ఆలోచిస్తూ పరాకుగా ఉండటం మొదలుపెట్టాడు.
ఒకరోజు అవంతీరాజు వద్దకు ఒక సన్యాసి
వచ్చాడు. యథావిధిగా అతనిని పూజించి
రాజు “స్వామి! విక్రమార్కుని
గుణగణములు నేను ఒక భట్రాజు ద్వారా విన్నాను.
ఆ విక్రముడంతటివాడు మీ భూమిమీదు లేడు.
అట్టి యసస్సు నాకెలా వస్తుందో చెప్పండి” అని
ప్రార్థించాడు
సన్యాసి “రాజా! నీకొక
సూక్ష్మోపాయం చెబుతాను.
హిమవన్నగర
సమీపములో ఒక కాళికాలయం ఉన్నది. సిద్ధప్రదేశమైన
ఆ ఆలయం వద్ద
కొందరు యోగపురుషులు హోమక్రియలు చేస్తుంటారు.
నీవక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి శుచివై
ఆలయప్రాంతంలోకి ప్రవేశించు.
గుండమొకటి
త్రవ్వి కాళికాదేవికై హోమముచేసి చివరికి గుండములో
దూకి నిన్ను నువ్వే పూర్ణాహుతి చేసుకో.
దయాసాగరులైన ఆ
యోగపురుషులు నిన్ను రక్షిస్తారు. నీ సాహసానికి
మెచ్చి దేవి కరుణిస్తుంది” అని హితము చెప్పాడు.

సదాచారుడైన రాజు అటులనే చేశాడు. ప్రత్యక్షమైన
కాళికాదేవితో “ప్రతిదినమూ ఏడుకోట్ల
ధనం నాకు రావాలి” అని అడిగాడు. “నాయనా!
ప్రతిరోజూ నీవు హోమంచేసి పూర్ణాహుతి
నిచ్చినట్లయితే నీవు కోరుకున్నట్టే
జరుగుతుంది” అని దేవి చెప్పి అంతర్ధానమయినది.
అవంతీరాజు యోగపురుషులకు కృతజ్ఞతలు తెలిపి
నగరానికి వచ్చి దేవి ఆజ్ఞానుసారం చేసి
ప్రతిరోజూ ఏడుకోట్లు సంపాదించాడు. ఆ
ధనముతో ఎన్నో అద్భుతమైన దానధర్మాలు చేసి
దానకర్ణుడని ప్రఖ్యాతిని పొందినాడు.
విమలుడైన విక్రమాక్రుడు అవంతీరాజు యొక్క
కీర్తిని విన్నాడు. తక్షణమే హిమవత్పర్వతములోని
కాళికాలయానికి వెళ్ళి స్నానముచేసి శుచి అయ్యి
ఆలయములో హోమముచేసి తన శరీరాన్ని
పూర్ణాహుతి చేయబోగా కాళికాదేవి ప్రత్యక్షమై
వరంకోరుకోమన్నది.
కైలాశశిఖరమంత ఉన్నత
హృదయం కల విక్రమాదిత్యుడు ఇలా
కోరినాడు “గుణవంతుడైన అవంతీరాజు తన శరీరాన్ని
పూర్ణాహుతిని చేయకుండానే ఆ ధనం అతనికి
వచ్చేటట్టు దానితో అతడు మరిన్ని
దానధర్మాలు చేసుకునేటట్టు అనుగ్రహించు తల్లీ”.
 దేవి విక్రమార్కుని త్యాగనిరతి చూసి “తథాస్తు”
అని ఆశీర్వదించింది
ఈ విషయం తెలుసుకున్న
అవంతీరాజు విక్రమాదిత్యుని వద్దకు వచ్చి “రాజా!
నీ వితరణశీలత అపూర్వము అద్వితీయము. నీవంటి
సౌశీల్యుడైన రాజు యీ భువిలో పుట్టబోడు” అని
స్తుతించి కృతజ్ఞతలను తెలుపుకొని
వెళ్ళిపోయాడు.

Comments

Popular posts from this blog

కాకి దాహం....

అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది. చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది. నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది. . . . “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక స్ట్రా వెతికి తాగేది”.

సింహము-ఎలుక

సింహము-ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది.  కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది. సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది. “నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది.  ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి. కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరిక...

కోపం వచ్చిన కోతులు

అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది. ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి. మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి. రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.